Breaking News

నల్లగొండ ఎంతో నచ్చింది

Published on Sun, 08/24/2025 - 13:45

నాకు నల్లగొండ ఎంతో నచ్చింది అంటున్నాడు ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆడ్రిన్‌. వారం క్రితం నల్లగొండకు వచ్చిన ఆయన శివాజీనగర్‌ పిరమిడ్‌ ధ్యాన కేంద్రంలో ఉంటూ వివిధ ప్రదేశాల్లో సందడి చేస్తున్నాడు. ఇక్కడి వారితో కలిసిపోయి అందరితో సరదాగా గడుపుతున్నాడు. శనివారం ఆయనను ‘సాక్షి’ పలకరించగా.. దేశ పర్యటన విశేషాలను పంచుకున్నాడు. వివరాలు ఆయన మాటల్లోనే..

రామగిరి(నల్లగొండ) : నాకు పర్యటనలు అంటే ఎంతో ఇష్టం. ఎంఎస్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ పూర్తి చేసిన నేను ఫ్రాన్స్‌ రైల్వేస్‌లో డేటా మేనేజర్‌గా పని చేస్తున్నాను. 2011లో మొదటిసారి ఢిల్లీలోని భీంటెక్‌ కంపెనీకి స్టడీ ఎక్ఛ్సేంజ్‌ కార్యక్రమానికి ఇండియా వచ్చాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నాకు ఎంతో నచ్చాయి. ఇప్పటికి ఎనిమిది సార్లు ఇండియాలో పర్యటించాను. నేపాల్‌ దేశాన్ని కూడా సందర్శించాను. ఇండియాలోని 14 రాష్ట్రాలు తిరిగాను. ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రదేశాలను వీక్షించాను. ఇక్కడి హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, లడక్, టిబెట్‌ అంటే నాకు ఎంతో ఇష్టం.

ధ్యానం ఇష్టం
ఈ ఏడాది జూలైలో ఢిల్లీకి వచ్చాను. రాజస్థాన్‌లోని జైపూర్, లడక్, కార్గిల్‌ను సందర్శించాను. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాను. ఆగస్టులో హైదరాబాద్‌ వచ్చి.. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ విపాసన ధ్యాన కేంద్రానికి వెళ్లాను. వారం రోజుల పాటు అక్కడ ధ్యానంలో శిక్షణ తీసుకున్నాను. అక్కడికి వలంటీర్‌గా వచ్చిన నల్లగొండ మండలం కంచనపల్లికి చెందిన నితిన్‌తో పరిచయం ఏర్పడింది. అతని ఆహ్వానం మేరకు ఆగస్టు 17న కంచనపల్లికి వచ్చాను.

ఇండియా గొప్ప దేశం
ఇండియా గొప్ప దేశం. ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ఒక విభిన్నమైన సంస్కృతి ఉంది. అనేక భాషలు మాట్లాడుతారు. పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటీవల వెళ్లిన అమర్‌నాథ్‌ యాత్ర ఎంతో అనుభూతిని ఇచ్చింది. ఇండియాలో నేను ఎక్కువగా నార్త్‌ ఇండియా 
సందర్శించాను. ఇప్పుడు మొదటిసారి సౌత్‌ ఇండియాకు వచ్చాను. ఇండియాలో నేర్చుకున్న ధ్యానం జీవనానికి, ఉద్యోగరీత్యా చాలా ఉపయోగపడుతుంది. హిందూ, బుద్ధిజం అంటే ఇష్టపడతాను. తీరిక సమయాల్లో రామాయణం, భగవద్గీత చదువుతాను.

నిత్య జాతీయ గీతాలాపన బాగుంది..
నల్లగొండ పట్టణం చాలా బాగుంది. వారం రోజులు ఇక్కడ గడిపాను. రోజూ ఉదయం బీజేపీ కార్యాలయంలో యోగా శిక్షణకు హాజరవుతున్నాను. ఇక్కడ అందరూ ఇష్టంగా నాతో సెల్ఫీలు దిగుతున్నారు. నల్లగొండలోని బిర్యానీ, దోశ, చాయ్‌ బాగున్నాయి. పానగల్‌ ఆలయాన్ని సందర్శించాను. కంచనపల్లి గ్రామంలో నాట్లు వేసే కూలీలతో సరదాగా గడిపాను. నాకు భారతదేశ సంస్కృతి ఎంతో ఇష్టం. నల్లగొండలో రోజూ ఉదయం జాతీయ గీతాలాపన చేయడం నాకు ఎంతో నచ్చింది. నేను కూడా భారతదేశ జాతీయ జెండా పట్టుకుని జాతీయ గీతం ఆలపించాను.  

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)