Breaking News

డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

Published on Mon, 01/06/2025 - 04:42

చిట్యాల: రోడ్డు ప్రమాదాలకు గల కారణాల్లో డ్రైవర్లకు దృష్టిలోపం ఉండటం కూడా ఒకటి. చాలామంది డ్రైవర్లకు అవగాహన లేక కంటి పరీక్షలు చేయించుకోరు. దాంతో వారికి దృష్టిలోపం ఉన్న విషయం వారికే తెలియదు. ఈ విషయాన్ని గుర్తించిన రోడ్డు రవాణా, పోలీస్‌ శాఖల అధికారులు.. వైద్యారోగ్య సహకారంతో డ్రైవర్లకు రహదారుల వెంట ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి వెంటనే కళ్లద్దాలు అందిస్తున్నారు. 

రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సడక్‌ సురక్ష అభియాన్‌ కార్యక్రమంలో రాష్ట్రంలో మొదటిసారి నల్లగొండ జిల్లాలోని 65వ నంబర్‌ జాతీయ రహదారిపై ‘నల్లగొండ దృష్టి’పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ దాబా వద్ద ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు.  

వెంటనే అద్దాలు.. 
కంటి పరీక్షల శిబిరంలో పరీక్ష చార్ట్‌ను ఆహార పదార్థాల మెనూ కార్డు మాదిరిగా ఏర్పాటు చేశారు. రోటి, పరోటా, తందూరి, దాల్‌ వంటి పేర్లను హిందీలో రాశారు. ఆదివారం వివిధ రాష్ట్రాలకు చెందిన 82 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 32 మందికి కంటి అద్దాలు అందజేశారు. 

వీరిలో చాలామంది మొదటిసారి కంటి పరీక్షలు చేయించుకోవటం విశేషం. రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారుల వెంట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి ప్రతీక్‌ రెడ్డి ఫౌండేషన్‌ ద్వారా అవసరమైన సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)