కొత్తగా నాలుగు డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు

Published on Wed, 11/13/2024 - 03:56

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 4 కొత్త డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌ ఆధునీకరణతో పాటు కొత్త ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మషల్కర్‌ కమిటీ సిఫారసులకు అనుగుణంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల సంఖ్యను పెంచేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం 71 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉన్నారని, అదనంగా కనీసం 150 (అదనంగా ఇంకో 80 పోస్టులు) మంది అవసరం అని అధికారులు మంత్రికి తెలిపారు. 

దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి అవసరమైన మేర పోస్టులు మంజూరు చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మిని్రస్టేషన్‌ (డీసీఏ) అధికారులు, తెలంగాణ మెడికల్‌ సరీ్వసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఎంసీఐడీసీ) అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.  నాసిరకం, నకిలీ మందులు తయారు చేసే సంస్థలపై, వాటిని విక్రయించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫార్మా కంపెనీలు, ఔషధ తయారీ యూనిట్లు, మందుల దుకాణాల్లో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. 

డ్రగ్స్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లలో ఫిర్యాదుల విభాగాలు (కంప్లైంట్‌ సెల్స్‌), వీటి ఆకస్మిక తనిఖీల కోసం రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే మందుల కొనుగోలు విషయంలో టీజీఎంఎస్‌ఐడీసీకి అవసరమైన సహకారం అందించాలని డీసీఏ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ, డీసీఏ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్‌ సహదేవరావు, డీసీఏ జాయింట్‌ డైరెక్టర్‌ జి.రాందాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)