Breaking News

ఖమ్మం జిల్లాలో నలుగురు మంత్రులు పర్యటన

Published on Sun, 08/10/2025 - 18:24

ఖమ్మం: జిల్లాలోని మధిర మండలం వంగవీడు వద్ద వైరా నదిపై రూ. 630.30 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకంకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , వాకాటి శ్రీహరి. శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో వారు ప్రసంగించారు. 

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ‘నాగార్జున సాగర్ నీరు ద్వారా నే ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. మధిర, ఎర్రుపాలెం మండలాలు సాగర్ జోను- 3 నుండి జోన్ -2 గా మారింది. బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషివల్లే  ఆగిపోయాయి. పోలవరం ఎత్తు తగ్గించాలి. అమాయకులైన 2 లక్షల గిరిజన భూములు ముంపుకు గురవుతున్నాయి’ అని పేర్కొన్నారు.

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు. అత్యంత కష్టం కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీనీ నిలబెట్టింది భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం 7లక్షల కోట్ల అప్పులు చేసింది. ఆర్థికశాఖ మంత్రిగా భట్టివిక్రమార్క సమర్థవంతంగా గాడిలో పెట్టారు. గత ప్రభుత్వం పదేళ్లల్లో ఉమ్మడి ఖమ్మం  జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసింది. అయినా పార్టీ చెక్కుచెదరలేదు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. బనకచర్ల ప్రాజెక్టుకు మేము పూర్తిగా వ్యతిరేకం. బనకచర్ల ప్రాజెక్టును కట్టనివ్వం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, అవినీతి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇదే చెప్పింది. కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది’ అని పేర్కొన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ‘జోన్‌- 3లో ఉన్న 33 వేల ఆయకట్టు జోన్ 2 గా మార్పు. గత ప్రభుత్వం పేద, అప్పుల తెలంగాణగా మార్చింది. మూడు విడతలో అర్హులైన వారికి ఇందిరమ్మా ఇల్లు పంపిణి. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు.భూ సమస్యను భూ భారతి ద్వారా శ్వాసత పరిష్కారం’అని తన ప్రసంగంలో తెలిపారు

మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ.. ‘ పేదోడి పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే జరుగుతుంది’ అని స్పష్టం చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)