Breaking News

నకిలీ ఐడీప్రూఫ్‌తో పాస్‌పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

Published on Mon, 02/05/2024 - 11:50

ఖమ్మం: నకిలీ ఐడీ ప్రూఫ్‌లతో పాస్‌పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ ఐడీలతో పాస్‌పోర్టులు పొంది అక్రమంగా భారత్‌లోకి చొరబడి ఖమ్మంలో నలుగురు బంగ్లాదేశీయులు నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్ కు చెందిన మహమ్మద్ నూర్ నబీ, మహమ్మద్ సాగర్‌లు నకిలీ ఐడీలతో పాస్‌పోర్టు పొందినట్లు తెలిపారు. మరో ఇద్దరు షేక్ జమీర్, మహమ్మద్ అమినూర్ అక్రమంగా భారత్ లో చొరబడి ఖమ్మంలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు.

సాగూరి ఖతూన్ అలియాస్ శిల్ప కొన్ని సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుండి భారత్ కి వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన బోడ రాములుతో సహజీవనం చేస్తోంది. వీరికి 11 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. సాగూరి ఖతూన్.. బంగ్లాదేశ్‌కు వెళ్లి తన సోదరులను ఖమ్మం తీసుకువచ్చింది. ఖమ్మంలో బాల కార్మికులతో సెంట్రింగ్ పని చేయిస్తుండగా పోలీసులకు వీరి విషయం తెలిసింది. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి పాస్‌పోర్టులు పొందినట్లు పోలీసులు గుర్తించారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి: పల్లె కడుపున రాచపుండు!

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)