Breaking News

బిల్లులు రాక.. పంచాయతీ భవనం తాకట్టు!

Published on Sat, 11/09/2024 - 11:30

మేడిపల్లి (వేములవాడ): చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవటంతో ఓ మాజీ సర్పంచ్‌ గ్రామ పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మేడిపల్లి మండలం తొంబరావుపేట తాజా మాజీ సర్పంచ్‌ మామిడి సత్తమ్మ ధర్మారెడ్డి శుక్రవారం కట్లకుంట తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో పంచాయతీకి సంబంధించి దస్త్రాలను తాకట్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుమారు రూ.18 లక్షలకు పైగా అప్పు చేసి తొంబరావుపేట పంచాయతీ భవనం నిర్మించామని, ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవటంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని వాపోయారు. అప్పు ఇచి్చనవారు రోజూ ఇంటికి వచ్చి వేధిస్తున్నారని తెలిపారు.

 దీంతో అప్పులు తీర్చేందుకు లోన్‌ కోసం పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేసిన వెంటనే వడ్డీతో సహా బ్యాంకులో చెల్లిస్తానని సిబ్బందికి వివరించారు. తాకట్టు పెట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తమకు వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని లేకుంటే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బ్యాంకు అధికారిని సంప్రదించటానికి ప్రయతి్నంచగా అందుబాటులోకి రాలేదు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)