Breaking News

ఇది ప్రకృతి వైపరీత్యం

Published on Sat, 09/07/2024 - 05:52

సాక్షి, హైదరాబాద్‌ : వాతావరణంలో అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుల చేర్పులతోపాటు అరుదైన ప్రకృతి వైపరీత్యం కారణంగా ములుగు అడవుల్లో చెట్లకు భారీగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ నివేదిక సమర్పించింది. దీనిని ‘ఎకోలాజికల్‌ డిజాస్టర్‌’గానే పరిగణించాల్సి ఉంటుందని ఇందులో సూచించినట్టు సమాచారం. మొత్తంగా 204 హెక్టార్లలో (500 నుంచి 600 ఎకరాల్లో) దాదాపు 70 వేల దాకా వివిధ జాతుల చెట్లకు నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. అటవీ పునరుద్ధరణతోపాటు, భూసార పరిరక్షణ చర్యలు, గ్యాప్‌ ఏర్పడిన చోట్ల వాటిని నింపేలా పెద్దమొత్తంలో మొక్కల పెంపకం, వంటివి చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో ఇంకా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతోపాటు, కొండ ప్రాంతాలు వంటివి ఉండడంతో జరిగిన నష్టం, కూలిన చెట్ల వివరాల సేకరణ అంత వేగంగా సాగడం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు.

వివిధ రూపాల్లో వాటిల్లిన నష్టంపై వారంరోజుల్లో క్షేత్రస్థాయి నుంచి ఒక స్పష్టమైన అంచనాకు వచ్చాక పర్యావరణం, అడవులతో సంబంధమున్న నిపుణులతో అధ్యయనం జరిపించాలని అటవీశాఖ నిర్ణయించింది. దేశంలోనే అత్యంత అరుదైన రీతిలో ములుగు అటవీప్రాంతంలో చెట్లకు నష్టం జరిగినందున, పూర్తి సమాచారం అందిన తర్వాతే అటవీ ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన నివేదిక అందజేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ములు గులో సుడిగాలుల బీభత్సం సమయంలోనే ఆదిలా బాద్‌ జిల్లా ఉట్నూరులో, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పరిధిలోనూ స్వల్పస్థాయిలో చెట్లకు నష్టం జరిగినట్లు అటవీ అధికారులు గుర్తించారు.  

ఉపగ్రహ ఛాయాచిత్రాలు వస్తేనే...
హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) నుంచి ఉపగ్రహ ఛాయాచిత్రాలను సేకరించడం ద్వారా ములుగు అటవీ విధ్వంసం కారణాలు వెల్లడి కాగలవని అటవీశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అవసరమైన డేటాను ఉపగ్రహం నుంచి సేకరిస్తున్నామని, రెండురోజుల్లో దీనిపై వివరాలు అందజేస్తామని ఎన్‌ఆర్‌ఎస్‌సీ అధికారులు చెప్పారు. ఈ సమాచారాన్ని తమ ఎర్త్‌ అండ్‌ క్లైమేట్‌ సైన్స్‌ ఏరియా డివిజన్‌ క్రోడీకరించి అందజేస్తామని అటవీ అధికారులకు చెప్పారు. అయితే భారత వాతావరణ శాఖ (ఐఎండీ)పై అటవీ అధికారులు పెట్టుకున్న ఆశలు మాత్రం నెరవేరలేదు.

ములుగు పరిసర ప్రాంతాల్లో తమ అబ్జర్వేటరీ లేనందువల్ల, ఈ బీభత్సం చోటుచేసుకున్న రోజునాటి వివరాలు ఇవ్వలేకపోతున్నామని అధికారులకు ఐఎండీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఐఎండీనే చేతులెత్తేస్తే ఇంకా తమకు ఎవరు వాతావరణ సాంకేతిక విషయాలు అందించగలరని అటవీ అధికారులు విస్తుపో తున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్‌ పూర్తయి, ఎన్‌ఆర్‌ఎస్‌సీ నుంచి సాంకేతిక సమాచారం అందాక 2,3 రోజుల్లో ములుగు జిల్లా అటవీ అధికారులు నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)