Breaking News

ఉత్తర ‘రింగు’కు అటవీ అనుమతులు

Published on Wed, 12/04/2024 - 04:24

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి అటవీ అనుమతులు మంజూరయ్యాయి. ఈ నెలాఖరుకు గాని జనవరి మొదటి వారంలో గాని ఈ రోడ్డుకు టెండర్లు పిలిచేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమవు­తున్న సమయంలో అటవీ అనుమతులకు సంబంధించిన ఇబ్బంది తొలగిపోయినట్టయ్యింది. ఇక పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. అవి కూడా వస్తే ఈ రోడ్డుకు ఎక్స్‌ప్రెస్‌ వే నంబర్‌ కేటాయింపు సులభవుతుంది. 

ఆ నంబర్‌ వస్తేనే టెండర్లు తెరిచేందుకు వీలుంటుంది. మెదక్‌ జిల్లా పరిధిలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి జిల్లాలో 8.511 హెక్టార్లు .. వెరసి 72.3536 హెక్టార్ల అటవీ భూమిని ఉత్తర రింగు అలైన్‌మెంటులో భాగంగా సేకరించనున్నారు. ఇందుకు ప్రతిగా అటవీ శాఖకు వేరే ప్రాంతంలో అంతే మొత్తం భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. 

సేకరించే అటవీ భూమిలో కోల్పోయే చెట్లకు పరిహారంతో పాటు, కొత్తగా పొందే భూమిలో అటవీ శాఖ చెట్ల పెంపకానికి అయ్యే ఖర్చును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ భాగానికి కావాల్సిన భూమిలో 90 శాతం సేకరణ ప్రక్రియ పూర్తయింది. త్వరలో అవార్డులు పాస్‌ చేయటం ద్వారా భూ యజమానులకు పరిహారం చెల్లించనున్నారు.

అనుమతి లేఖ అందింది: మంత్రి కోమటిరెడ్డి
ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగానికి సంబంధించి 72.3536 హెక్టార్ల అటవీ భూమి స్వాధీనానికి అనుమతిస్తూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కైలాష్‌ భీమ్‌రావ్‌ భవర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

ఉత్తర భాగం రీజినల్‌ రింగురోడ్డు నిర్మాణానికి భారతమాల పరియోజన కింద అనుమతి ఇస్తున్నట్టుగా లేఖలో పేర్కొనట్టు వెల్లడించారు. పర్యావరణ నిబంధనలకు లోబడి భూసేకరణ చేస్తామని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు తెలిపామని పేర్కొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)