Hyderabad: కుక్కకు భయపడి మూడో అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్‌

Published on Fri, 01/13/2023 - 13:48

సాక్షి, హైదరాబాద్‌: పార్శిల్‌ ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ బాయ్‌పై పెంపుడు కుక్క దాడి చేయడంతో  మూడో అంతస్తు నుంచి కిందకు దూకిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 6లోని లుంబిని ర్యాక్‌ క్యాజిల్‌ అపార్ట్‌మెంట్‌లో నివసించే శోభనా నాగాని ఫుడ్‌ డెలివరీ ఆర్డర్‌ చేశారు. ఈ నెల 11న ఉదయం 9 గంటల ప్రాంతంలో మహ్మద్‌ రిజ్వాన్‌(23) స్విగ్గి డెలివరీ బాయ్‌ పార్శిల్‌ ఇవ్వడానికి వెళ్లి తలుపు కొట్టాడు.

తలుపు తీసి ఉండటంతో ఒక్కసారిగా ఇంట్లోనుంచి జర్మన్‌ షెపర్డ్‌ కుక్క బయటికి దూసుకొచ్చి అతడిని కరవబోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రిజ్వాన్‌ కుక్క బారి నుంచి తప్పించుకునేందుకు పరుగు పెట్టాడు.  అతడి వెంట కుక్క పడడంతో మూడో ఫ్లోర్‌ నుంచి కిందకు దూకాడు. కారిడార్‌ రెయిలింగ్‌ నుంచి జారి కిందపడ్డాడు.   దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.  వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం నిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

యజమానురాలు  కుక్కను కట్టకుండా నిర్లక్ష్యం వదిలివేయడంతోనే  తమ సోదరుడు తీవ్ర గాయాలపాలయ్యాడని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి సోదరుడు ఖాజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శోభనపై ఐపీసీ సెక్షన్‌ 336, 289 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)