Breaking News

నిర్మల్‌ జిల్లా బాసరలో విషాదం

Published on Mon, 06/16/2025 - 05:57

భైంసా/బాసర/భైంసా టౌన్‌/చింతల్‌ (హైదరాబాద్‌): నిర్మల్‌ జిల్లా బాసర వద్ద గోదావరిలో ఆదివారం ఘోరం జరిగింది. దైవ దర్శనం చేసుకోవడంతో పాటు సరదాగా గడపాలని వచ్చిన హైదరాబాద్‌కు చెందిన యువకులు నదిలో స్నానం చేస్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మూడు కుటుంబాలకు చెందిన వీరంతా బంధువులే అని తెలిసింది. 

కాగా ఊహించని విధంగా జరిగిన ఈ దుర్ఘటనతో రోదనలు మిన్నంటాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బేగంబజార్, చింతల్, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల నుంచి, రాజ స్తానీ కుటుంబాలకు చెందిన సుమారు 30 మంది ఆదివారం ఉదయం ఇంటర్‌ సిటీ రైలులో బాసర చేరుకున్నారు. తొలుత స్నానాలు చేయాలని భావించారు. 

ఘాట్‌ వద్ద నీరు మురికిగా ఉండడంతో బోటు ద్వారా నది మధ్యలోని ఇసుక తిన్నెల వద్దకు వెళ్లారు. అంతా కేరింతలు కొడుతూ సంతోషంగా గడుపుతుండగా, రాథోడ్‌ రాకేశ్‌ (20), భరత్‌ (16), మదన్‌ (18), వినోద్‌ (19), రుత్విక్‌ (22) స్నానానికి నదిలో దిగారు. అయితే అక్కడ నది లోతు అంచనా లేకపోవడం వారి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. కుటుంబీకులు చూస్తుండగానే ఒకరి వెనుక ఒకరు ఐదుగురూ నీట మునిగిపోయారు. 

అంతా కేకలు పెట్టడంతో అక్కడే ఉన్న కొందరు స్పందించి కొద్దిసేపటికే రాకేశ్, భరత్, మదన్, రుత్విక్‌లను ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికే వారు చలనం లేని స్థితిలో ఉండగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..వారిని వెంటనే భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా గంట పాటు గాలించిన తర్వాత వినోద్‌ మృతదేహం లభించింది.  

ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత 
తొలుత ఆస్పత్రికి తరలించిన నలుగురిలో ఇద్దరు కొన ఊపిరితో ఉన్నారని, ఆస్పత్రి సిబ్బంది సరిగా స్పందించపోవడంతో వారు మరణించారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. వారి రోదనలతో ఆస్పత్రి ఆవరణ మార్మోగిపోయింది. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. భైంసా ఏఎస్పీ అవినాష్‌ కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. 

ఫాదర్స్‌ డే రోజు పుత్రశోకం 
ఈ దుర్ఘటనలో మరణించిన రాకేశ్, మదన్, భరత్‌ ముగ్గురు సోదరులు. ప్రేమ్‌రామ్, సోను దంపతుల కుమారులు. ఒకేసారి ముగ్గురూ మరణించడంతో భార్యాభర్తలు కుప్పకూలిపోయారు. విషయం తెలిసి హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారు ఆస్పత్రి వద్ద గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. చింతల్‌ డివిజన్‌ చంద్రానగర్‌కు చెందిన ప్రేమ్‌రామ్‌ రైస్, కిరాణా హోల్‌సేల్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 

ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా తండ్రికి శుభాకాంక్షలు చెప్పిన ముగ్గురు కుమారులు ఇతర బంధువులతో కలిసి బాసర బయలుదేరి వెళ్లారు. నదిలో ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చారు. రాకేశ్‌ డిగ్రీ చదువుతుండగా, మదన్‌ ఇటీవల నీట్‌ పరీక్ష రాసి మంచి ఫలితం సాధించాడని, భరత్‌ ఎస్సెస్సీలో స్థానిక స్కూల్‌ టాపర్‌ అని తెలిసింది. 

వీరి సమీప బంధువులు దిల్‌సుఖ్‌నగర్‌ సమీపంలోని శాలివాహననగర్‌లో నివాసం ఉంటుండగా వారి కుమారుడు రుత్విక్‌ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వినోద్‌ కుటుంబం బేగంబజార్‌లో ఉంటుందని తెలిసింది. స్థానిక రాజస్తానీలు కొందరు భైంసా ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను ఓదార్చారు. 

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)