Breaking News

టెన్త్‌ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురి అరెస్ట్‌

Published on Sun, 03/30/2025 - 02:12

నకిరేకల్‌: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురిని శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించామని నల్లగొండ జిల్లా నకిరేకల్‌ సీఐ రాజశేఖర్‌ తెలిపారు. ఈ నెల 21న నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఓ యువకుడు తెలుగు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాద్యమాల్లో వైరల్‌ చేసిన విషయం విధితమే. ఈ ఘటనలో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఈ నెల 23న చిట్ల ఆకాష్, బండి శ్రీను, గుడుగుంట్ల శంకర్, బ్రహ్మదేవర రవిశంకర్, ఓ బాలుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. 

కేసు తదుపరి విచారణ అనంతరం శనివారం నకిరేకల్‌కు చెందిన పోగుల శ్రీరాముల, తలారి అఖిల్‌కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్‌కుమార్, పళ్ల మనోహర్‌ను శనివారం రిమాండ్‌కు పంపామని, ఓ బాలుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. రిమాండ్‌ చేసినవారిలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్‌ఎస్, ఒకరు బీజేపీకి చెందిన వారుగా గుర్తించామని పేర్కొన్నారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)