Breaking News

ఐదుగురు ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి

Published on Fri, 08/09/2024 - 04:30

సాక్షి, హైదరాబాద్‌: ఐదుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారులు కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, బి.శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్, సౌమ్యా మిశ్రా, శిఖాగోయల్‌ ఉన్నారు. అయితే, వీరిలో కేడర్‌ కేటాయింపు వివాదం కొనసాగుతున్న ఐపీఎస్‌ అధికారి అభిలాష బిస్త్‌కు మాత్రం డీఓపీటీ నుంచి తెలంగాణ కేడర్‌కు కేటాయించినట్టు నిర్ధారణ అయిన తర్వాతే పదోన్నతి వర్తిస్తుందని స్పష్టం చేశారు. 

డీజీలుగా పదోన్నతి పొందిన ఐదుగురు అధికారులను తిరిగి ప్రస్తుత పోస్టింగ్‌లలోనే డీజీపీ హోదాలో కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. వీరిలో కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌ సీపీగా, బి.శివధర్‌రెడ్డి ఇంటెలిజెన్స్‌ డీజీపీ, అభిలాష బిస్త్‌ను తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్, డీజీపీ ట్రైనింగ్‌గా, డా.సౌమ్యా మిశ్రా జైళ్లశాఖ డీజీగా, శిఖాగోయల్‌ సీఐడీ డీజీపీగా, తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా, టీజీఎఫ్‌ఎస్‌ఎల్, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

కాగా, పదోన్నతి పొందిన వారిలో హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సర్వీస్‌ వచ్చే ఏడాది ఆగస్టు వరకు, ఇంటెలిజెన్స్‌ డీజీ శివధర్‌రెడ్డి సరీ్వస్‌ 2026 ఏప్రిల్‌ వరకు, జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా సరీ్వస్‌ 2027 డిసెంబర్‌ వరకు, శిఖాగోయల్‌ సర్వీస్‌ 2029 మార్చి వరకు ఉంది.   

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)