Breaking News

ఐదు ఉద్యోగాలు సాధించిన సంకీర్తన

Published on Thu, 03/20/2025 - 13:06

మంచిర్యాలటౌన్‌: చిన్ననాటి నుంచి చదువులో రాణిస్తూ వరుసగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొడ్డు సంకీర్తన. పట్టణంలోని రాంనగర్‌కు చెందిన బొడ్డు భీమయ్య, మల్లక్క దంపతులకు కుమారుడు సాయికిరణ్‌, కుమార్తె సంకీర్తన సంతానం. భీమయ్య హమాలి పనిచేస్తూ తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. 

పదోతరగతి మంచిర్యాల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో, డిగ్రీ కోటి ఉమెన్స్‌ కళాశాలలో చదివిన సంకీర్తన 2023లో కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించింది. అందులో చేరకుండానే గ్రూప్‌–4 రాసి మంచిర్యాలలోని జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో జూనియర్‌ అసిస్టెంటుగా ఉద్యోగం సాధించింది. విధులు నిర్వహిస్తూనే మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించిన సీడీపీవో పరీక్షతో పాటు, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌(సూపర్‌వైజర్‌) గ్రేడ్‌–1లో రెండు ఉద్యోగాలు సాధించింది.

 సీడీపీవో ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు, మల్టీజోన్‌ కేటగిరీలో 7వ ర్యాంకు సాధించింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌(సూపర్‌వైజర్‌) గ్రేడ్‌ 1 మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఫలితాలను బుధవారం ప్రకటించగా, రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు, మల్టీజోన్‌లో 1వ ర్యాంకు సాధించింది.

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)