Breaking News

జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ

Published on Thu, 05/29/2025 - 08:12

సాక్షి, హైదరాబాద్: జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్‌ కలెక్టర్, వివిధ విభాగాల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉబ్బస వ్యాధిగ్రస్తుల కోసం బత్తిని కుటుంబం నగరంలో ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం కార్యక్రమం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉండడంతో వారికి సరిపడా తాగునీరు, వసతి, భోజనం, టాయిలెట్స్‌ వంటి సౌకర్యాలు కల్పించేలా జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ట్రాఫిక్, భద్రత వంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ చుట్టూ పది పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కి రావడం కోసం ఆర్టీసీ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్, కాచిగూడ, చర్లపల్లి నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. 

చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు.  చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ భరించాలని సూచించారు. సమావేశంలో ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, బత్తిని అమర్‌నాథ్‌ గౌడ్, గౌరీ శంకర్, చంద్రశేఖర్, శివశంకర్, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో బత్తిని కుటుంబ సభ్యులు జూన్‌ 8వ తేదీన చేప ప్రసాదానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.    

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)