Breaking News

30న కానిస్టేబుల్‌ పోస్టులకు తుది రాతపరీక్ష

Published on Sun, 04/23/2023 - 04:53

సాక్షి, హైదరాబాద్‌: యూనిఫాం సర్వీసెస్‌ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీసు శాఖలోని వివిధ విభాగాల కానిస్టేబుల్‌ పోస్టులకు తుదిరాత పరీక్షను ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నారు. ఉమ్మడి 9 జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 30వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సివిల్‌ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు తుది రాతపరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు తుది రాతపరీక్ష నిర్వహించనున్నారు. సివిల్, కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్‌ పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల రెండు పరీక్షలకు సైతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఒకే పరీక్షకేంద్రాన్ని కేటాయించనున్నట్టు చైర్మన్‌ స్పష్టం చేశారు.

కానిస్టేబుల్‌ తుది రాతపరీక్ష హాల్‌టికెట్లను అభ్యర్థులు సోమవారం(ఈ నెల 24) ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు www.tslprb.com వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు ఉన్న అభ్యర్థులు 93937 11110, 93910 05006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.    

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి