Breaking News

TS: ఒకేసారి మూడు నెలల సన్న బియ్యం పంపిణీ

Published on Tue, 05/27/2025 - 11:12

వికారాబాద్‌: ఒకేసారి మూడు నెలల(జూన్, జూలై, ఆగస్టు)కు సంబంధించిన రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ ఒకటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే మన రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను అధిగమించి మూడు నెలల కోటా ఒకేసారి ఇచ్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఈ విషయమై కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్, అడిషనల్‌ కలెక్టర్‌(రెవెన్యూ) లింగ్యానాయక్‌ పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం క్షేత్రస్థాయి అధికారులు, డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సాధారణంగా నెలలో 15 రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేసేవారు.. ప్రస్తుతం ఒకేసారి మూడు నెలల కోటా ఇస్తున్నందున డువుతో సంబంధం లేకుండా లబి్ధదారులు తీసుకెళ్లే వరకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.  

సమస్యలను అధిగమిస్తేనే.. 
ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ బియ్యం ఒకే నెలలో పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పలు సమస్యలు ఎదురుకానున్నాయి. గతంలో కోవిడ్‌ సమయంలో మాత్రమే ఒకేసారి రెండు నెలల కోటా ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఒకటి లేదా రెండు నెలల కోటాను పంపిణీ చేసేందుకు మెకానిజం ఉండగా మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలంటే మాత్రమే పలు సమస్యలను అధిగమించాల్సి ఉంది. కోటా నిల్వకు సరిపడా గోదాములను సమకూర్చుకోవాల్సి ఉంది. 

ఇదే సమయంలో గ్రామాల్లో డీలర్ల దగ్గర కూడా మూడు నెలల కోటా ఒకే సారి నిల్వ చేయటానికి సరపడా స్థలాలు లేకపోవటం కూడా సమస్య కానుంది. అయితే ఇతర జిల్లాల నుంచి వచి్చన బియ్యం వచ్చినట్టు గ్రామాలకు చేరవేయటం ద్వారా గోదాముల కొరతను అధిగమించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే నెలలో 15రోజులు కాకుండా నెల మొత్తం బియ్యం పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)