Breaking News

గిరిజన శాఖలో ‘కుర్చి’ పోరు

Published on Fri, 07/11/2025 - 04:54

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రత్యేకంగా ఉన్న ఇంజనీరింగ్‌ విభాగం అధిపతి పోస్టు కోసం జోరుగా పైరవీలు సాగుతున్నాయి. ఈ విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ)గా పనిచేసిన శంకరయ్య జూన్‌ 30న పదవీ విరమణ చేయటంతో ఆ కుర్చిలో తదుపరి ఎవరు కూర్చుంటారోననే చర్చ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌ (డీఎస్‌ఎస్‌)లో జోరుగా సాగుతోంది. విద్య, సంక్షేమ శాఖలకు సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టేందుకు విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(ఈడబ్ల్యూఐడీసీ) ఉన్నప్పటికీ... గిరిజన సంక్షేమ శాఖకు మాత్రం ప్రత్యేకంగా ఇంజనీరింగ్‌ విభాగం ఉంది. ఈ శాఖ నిర్మాణ పనులన్నీ ఈ విభాగం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. ప్రస్తుతం ఈ పోస్టు ఖాళీ కావడంతో కుర్చిని దక్కించుకునేందుకు పైరవీలకు తెరలేచింది. 

మంత్రి అడ్లూరి వద్దకు పంచాయితీ 
గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజనీరింగ్‌ విభాగాధిపతిగా చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) ఉంటారు. ఆ తర్వాతి స్థాయిలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ), ఆయన కింద ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ)లు ఉంటారు. వారి కింద ఉండే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈఈ), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ)లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు. సీఈ శంకరయ్య పదవీ విరమణ చేయటంతో.. ఆ బాధ్యతలను తదుపరి కేడర్‌లో ఉన్న ఎస్‌ఈకి అర్హతలను బట్టి ఇవ్వాలి. కానీ, ఈ విభాగంలో కొంత కాలంగా ఎస్‌ఈ, ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదోన్నతుల విషయంలో నెలకొన్న సీనియార్టీ వివాదంతో ఈ ప్రక్రియ కొన్నేళ్లుగా నిలిచిపోయింది. దీంతో ఈఈ పోస్టుల్లో ఇన్‌చార్జ్‌లే కొనసాగుతున్నారు.

ఇప్పుడు సీఈ కుర్చీ ఖాళీ కావడంతో ఆ ఇన్‌చార్జ్‌లు విభాగాధిపతి కుర్చీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకే బ్యాచ్‌కు చెందిన నలుగురు డీఈఈలు ఏకంగా సీఈ కుర్చీ దక్కించుకునేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. వయసు, మెరిట్‌ ఆధారంగా తనకే సీఈ కుర్చీ దక్కుతుందని ఒక అధికారి ధీమాతో ఉండగా... ప్రభుత్వ పెద్దల అండతో అనూహ్యంగా మరో అధికారి తెరపైకి రావడంతో ఉత్కంఠకు తెరలేచింది.

ప్రస్తుతం ఈ ఫైలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేషీకి చేరింది. దీంతో పోటీలో ఉన్న డీఈఈలు మంత్రి పేషీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే, పోటీలో ఉన్న నలుగురు అధికారులపైనా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి. ఇద్దరిపై ఏసీబీ కేసులు కూడా ఉన్నాయి. మరొకరు స్థానికత అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఈ కుర్చీ ఎవరికి దక్కుతుందా? అనే ఆసక్తి నెలకొంది. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)