Breaking News

బాధిత మహిళా ప్రొఫెసర్‌ గదికి తాళం

Published on Tue, 06/02/2026 - 05:30

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ)లో లైంగిక వే«ధింపులకు గురైన మహిళా ప్రొఫెసర్‌ గదికి సోమవారం తాళం వేశారు. బాధిత మహిళను బలవంతంగా విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. అయితే  ఆమె యథావిధిగా తన విధులు నిర్వహించేందుకు వెళ్లగా ఆమె గదికి తాళం వేసి ఉంది. ఈ విషయమై ఆమె చైర్మన్‌ కార్యాలయాన్ని సంప్రదించే ప్రయ త్నం చేయగా.. ఎవరూ అందుబాటులోకి రాకపోవ టంతో గంటపాటు నిరీక్షించి వెనుతిరిగిపోయినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగబద్ధమైన పదవిలో పనిచేసి ప్రస్తుతం ఆస్కీలో కీలక బాధ్య తలు నిర్వహిస్తున్న మాజీ ఐఏఎస్‌ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు చాలాకాలం క్రితమే మహిళా ప్రొఫెసర్‌ అంతర్గత ఫిర్యాదుల విభాగానికి ఫిర్యా దు చేశారు. అయినా అక్కడ సరైన న్యాయం జరగ కపోవటంతో ఆధారాలతో సహా ఆమె జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కమిషన్‌ ఈ నెల 3న ఆస్కీ చైర్మన్‌ పద్మనా భయ్యను హాజరు కావాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే జాతీయ మహిళా కమిషన్‌ గత నిర్ణయాల మేరకు.. ఫిర్యాదు విచారణలో ఉండగానే.. ఫిర్యా దుదారులను ఉద్యోగాల నుంచి తొలగించటం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఉన్నా.. అవేవీ తమకు పట్టవన్న రీతిలో ఆస్కీలో ఆమెను సోమవారం విధుల్లోకి రానివ్వలేదు. 

కార్యాలయంలో తన వస్తువులు అనేకం ఉన్నాయని, తీసుకోనివ్వాలని కోరినా.. అక్కడి సిబ్బంది నుంచి సరైన సమాధా నం లేకపోగా.. సాయంత్రానికి ‘మీ వస్తువులు ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌లో ఉంటాయి.. మీరెప్పుడైనా తీసుకోవచ్చు’ అంటూ బా«ధిత మహిళా ప్రొఫెసర్‌ కు మెయిల్‌ పంపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ‘ఆస్కీలో కీచక బాస్‌’ శీర్షికన ఆదివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం రెండు రాష్ట్రాల అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎవరా.. కీచక బాస్‌ అంటూ కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో సైతం వివరాలు సేకరించింది. ఇదిలా ఉంటే కీచకబాస్‌ వేధింపులు ప్రొఫెసర్లపైనే కాకుండా.. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, కింది స్థాయి ఉద్యోగు లపై కూడా మితిమీరటంతో వారు సైతం ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)