Breaking News

ప్రిన్సిపాల్‌ గదిలో బీరు సీసాలు

Published on Sun, 07/07/2024 - 08:25

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని బాలెంల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో మద్యం సీసాలు దర్శనమివ్వడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తరచూ మద్యం తాగుతూ ప్రిన్సిపాల్‌ శైలజ తమను వేధింపులకు గురిచే­సు­్తన్నారని వారు ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ అర్థరాత్రి వేళ సహాయ కేర్‌ టేకర్‌ సౌమిత్రితో కలిసి మద్యం తాగుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రిన్సిపాల్‌ రూమ్‌ కు తాళం వేశారు. 

విషయం తెలుసు­కున్న స్థాని­క ఆర్డీవో వేణుమాధవ్‌రావు, కళాశాలలో ఆర్సీవో అరుణకుమారి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి, డీఎస్పీ రవికుమార్‌ కశాశాలకు చేరుకున్నారు. వాస్తవాలను విచా­రించి ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్య­లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా విద్యార్థినులు శాంతించలేదు. ఈ ఘటనపై మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఈ ఘటనపై పూర్తిస్థాయి విచా­రణ జరపాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్‌­కుమా­ర్‌రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ కమిటీ అధికారిగా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లతను నియమిస్తూ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రాథమిక విచారణ ఆధారంగా కళాశాల ప్రిన్సిపాల్‌ను బదిలీ చేస్తున్నట్టు తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌ సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి ఒక ప్రకటనలో తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)