Breaking News

మనోడు.. పగోడు ఇదో ఫీజుల గోడు!

Published on Wed, 02/18/2026 - 05:59

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంజ నీరింగ్‌ కాలేజీల ఫీజుల వ్యవహా రం వివాదాస్పదమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని కాలేజీలకు ఫీజులు తగ్గిస్తూ, మరికొన్ని కాలేజీ లకు పెంచుతూ  రూపొందించిన ప్రతిపాదనలు పలు ఆరోపణలకు దారి తీస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్‌ ఆర్‌సీ) నిర్ణయాలకు విరుద్ధంగా ఉన్నాయని కాలేజీల యాజమా న్యాలు ఆరోపిస్తున్నాయి. ఫీజు లను రాజకీయ కోణంలో చూశారని, స్వతంత్ర ప్రతిపత్తి గల ఎఫ్‌ఆర్‌సీని లెక్కజేయలేదని అంటున్నాయి. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. 

ప్రతీ మూడేళ్లకోసారి కాలేజీల ఫీజులను ఎఫ్‌ఆర్‌సీ సమీక్షిస్తుంది. 2025–28 సంవత్సరానికి సంబంధించి అన్ని కాలేజీల ఆడిట్‌ నివేదికలను ఎఫ్‌ఆర్‌సీ పరిశీలించి ఫీజుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి గత ఏడాది పంపింది. దీనిపై సంతృప్తి చెందని ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు మార్గదర్శకాలు రూపొందించింది. దీని ఆధారంగా మరోసారి కాలేజీ యాజమాన్యాలతో ఎఫ్‌ఆర్‌సీ చర్చించి గత డిసెంబర్‌లో కొత్త ఫీజుల ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. వాస్తవానికి 2025–26 విద్యా సంవత్సరం నుంచే కొత్త ఫీజులు అమలు కావాల్సి ఉంది. ఇది జరగకపోవడంతో కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. తాజాగా ఫీజులు నిర్ధారణ చేస్తూ ప్రభుత్వం కోర్టుకు నివేదిక సమర్పించింది.

70 కాలేజీల్లో పాతవే...
రాష్ట్రంలో 157 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలున్నాయి. వీటిల్లో 70 కాలేజీల్లో పాత ఫీజులే ఉంచారు. 63 కాలేజీల్లో ఫీజులు పెంచారు. 19 కాలేజీల్లో ఫీజులకు కోత పెట్టారు. ఐదు కాలేజీలు ఫీజుల ప్రతిపాదనలను ఎఫ్‌ఆర్‌సీ ముందు పెట్టలేదు. ఇవి మూత పడినట్టుగా భావిస్తున్నారు. అయితే, అధికార పార్టీకి చెందినవారి కాలేజీల ఫీజులను పెంచి.. విపక్ష పార్టీకి చెందినవారి ఫీజులు తగ్గించారని సంఘాల నాయకులు చెబుతున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)