Breaking News

‘ఫీజు’లకు మోక్షం ఎప్పుడు?

Published on Fri, 05/30/2025 - 01:23

ఎల్బీనగర్‌కు చెందిన బి. మనస్విని గండిపేటలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ఫైనలియర్‌ పూర్తి చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద అర్హత సాధించిన ఆమె ఏటా దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు పైసా విడుదల కాలేదు. కన్వినర్‌ కోటాలో సీటు పొందిన కూతురి కోసం తల్లిదండ్రులు నాలుగేళ్లపాటు ట్యూషన్‌ ఫీజు కోసం అప్పు చేసి రూ. 6 లక్షల వరకు చెల్లించారు. ఇప్పుడు ఆ అప్పుపై వారు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన ఎం.కీర్తి బాచుపల్లిలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ (థర్డ్‌ ఇయర్‌ పూర్తి చేసింది) చదువుతోంది. ఆమెకు మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందలేదు. ఫీజు కోసం తొలి ఏడాది కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేయనప్పటికీ రెండు, మూడో సంవత్సరంలో ఫీజుల కోసం యాజమాన్యం ఒత్తిడి చేసింది. ఫీజు కడితేనే పరీక్షలకు అనుమతిస్తామని చెప్పడంతో ఇప్పటివరకు రూ. 4.5 లక్షలు చెల్లించింది. వచ్చే నెలాఖరులోగా ఫైనలియర్‌ ఫీజు రూ. లక్షన్నర కట్టాలని యాజమాన్యం స్పష్టం చేయడంతో డబ్బు కోసం ఆమె కుటుంబం అప్పు కోసం ప్రయత్నిస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాలేజీ విద్యార్థులకు అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. గత రెండేళ్లలో సుమారు రూ. 4,900 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. అలాగే అంతకు ముందు బకాయిలు సుమారు మరో రూ. 2 వేల కోట్లు ఉన్నాయి. బకాయిల్లో కొన్నింటికి టోకెన్లు జారీ అవగా మరికొన్ని మంజూరు దశలోనే ఉండిపోయాయి. 

పరిశీలనకే పరిమితం... 
ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద వస్తున్న దరఖాస్తులు పరిశీలనకే పరిమితమవుతున్నాయి. ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థులు ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏటా దాదాపు ఆరు నెలలపాటు దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ సాగుతుంది. ఆన్‌లైన్‌లో వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి అర్హతలను నిర్ధారించి మంజూరు చేయడం వరకే సంక్షేమ శాఖలు పరిమితమవుతున్నాయి. ఆ తర్వాత ట్రెజరీలకు బిల్లులు పంపుతండగా ఆర్థిక శాఖ వద్ద ఈ ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి.  

ఖజానా విభాగంలో రూ. 1,150 కోట్ల బిల్లులు.. 
సంక్షేమ శాఖ అధికారులు దరఖాస్తులను పరిశీలించి వాటిని బిల్లుల రూపంలో ఖజానా శాఖకు పంపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బీఆర్వో (బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌)లకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఆయా బిల్లులను పాస్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో రూ. 1,150 కోట్ల విలువైన బిల్లులకు ఖజానా విభాగంలో టోకెన్లు జారీ అయ్యాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే వాటికి మోక్షం కలుగుతుంది. 

అయితే ప్రస్తుతం టోకెన్ల రూపంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ 2021–22, 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించినవే కావడం గమనార్హం. మరోవైపు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంపై కళాశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేశాక వాటిని తిరిగి చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు చెబుతూ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాయి. 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)