మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
చదువు, వైద్యంపై వైఎస్ జగన్ కృషి గొప్పది: రచయిత హర్ష్ మందర్
Published on Mon, 01/27/2025 - 20:48
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజల అవసరాలేంటో తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు ప్రముఖ రచయిత హర్ష్ మందర్. అలాగే, ప్రజల కనీస అవసరాలైన చదువు, ఆరోగ్యం, రవాణా, ఉపాధి వంటి అంశాలపై వైఎస్ జగన్ కృషి ఎంతో గొప్పదని కొనియాడారు.
హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ కోసం ప్రముఖ రచయిత హర్ష్ మందర్ సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హర్ష్ మందర్ సాక్షితో మాట్లాడుతూ.. ‘బడుగు బలహీన వర్గాల విషయంలో సమాజంలోని ప్రతీ వ్యక్తి సానుకూల దృక్పథంతో ఉండాలి. వారి ఉన్నతికి కృషి చేయాలి. ఈ మాట ఆదర్శంగా అనిపించవచ్చు. కార్యాచరణకు చాలా దూరమనీ అనిపించవచ్చు. అలాగని నేను చెప్పడం మానను. చెబుతూ ఉంటేనే ఆలోచన వస్తుంది. అది ఏదో ఒక రోజు కార్యాచరణవైపు నడిపిస్తుంది. ఆ దశకు చేరుకునే వరకు చెబుతూనే ఉంటాను.
పాలకులకు కూడా అట్టడుగు వర్గాల వారి పట్ల ఆ సానుకూల దృక్పథం ఉండాలి. దాన్ని సంక్షేమం, అభివృద్ధి రూపంలో చూపించాలి. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. ప్రజల కనీస అవసరాలైన చదువు, ఆరోగ్యం, రవాణా, ఉపాధి లాంటివాటి పట్ల దృష్టి పెట్టాలి. చిత్తశుద్ధితో పనిచేయాలి. వీటి విషయంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఉన్న ఆలోచన, విజన్ చాలా గొప్పవి. వైఎస్ జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజల అవసరాలేంటో తెలుసుకున్నారు. వాటిని తాను ఎంత వరకు నెరవేర్చగలరో కసరత్తు చేశారు. చదువు, ఆరోగ్యం విషయాల్లో వాటిని అమలు చేశారు. ఆ రంగాల్లో ఆయన చేసిన కృషి అభినందించదగినది. ఈ విషయంలో ఆయన ఇతర రాష్ట్రాలకూ మార్గదర్శకంగా నిలిచారని చెప్పవచ్చు అని ప్రశంసించారు.
Tags : 1