Breaking News

కుటుంబ సమస్యలే.. ఉరితాళ్లు

Published on Wed, 10/01/2025 - 06:22

దేశంలో 2023లో మొత్తం 1,71,418 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2022తో పోలిస్తే ఇది స్వల్పంగా ఎక్కువ. గత 5 ఏళ్లుగా చూస్తే.. ఏటా ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. జాతీయ నేర గణాంక విభాగం (ఎన్‌సీఆర్‌బీ) 2023వ సంవత్సరానికి విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కుటుంబ సమస్యలు, తట్టుకోలేని అనారోగ్య సమస్యలు; మాదక ద్రవ్యాలు, మద్యానికి    బానిసలు కావడం, ప్రేమ వ్యవహారాలు, అప్పుల భారం, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్‌ కావడం.. ఇలా అనేక కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. మొత్తం మరణించినవారిలో దాదాపు 33 శాతం.. 18–30 ఏళ్లలోపు వారే. 2022తో పోలిస్తే (34.56 శాతం) ఇది తక్కువ. 2022లో విద్యార్థుల ఆత్మహత్యలు 7.6 శాతం కాగా, 2023లో ఇవి 8.1 శాతానికి పెరగడం గమనార్హం. మొత్తం మృతుల్లో 72.7 శాతం పురుషులు కాగా, 27.2 శాతం మహిళలు.

టాప్‌ 10 రాష్ట్రాలు
2021, 2022, 2023.. ఈ మూడు సంవత్సరాల్లోనూ ఆత్మహత్యల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌. మొత్తం ఆత్మహత్యల్లో సుమారు 34 శాతం ఈ రాష్ట్రాల్లోనే జరిగాయి.

అనేక కారణాలు
దేశంలో ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు.. కుటుంబ సమస్యలే. అనారోగ్య సమస్యలను తట్టుకోలేక మరణాన్ని ఆశ్రయించేవారూ ఎక్కువగానే ఉన్నారు. పై రెండు కారణాలవల్లే దాదాపు 51 శాతం ఆత్మహత్యలు జరిగాయి.

వృత్తి / ఉద్యోగాల పరంగా..: ఆత్మహత్యలు చేసుకున్నవారిలో గృహిణులు 14 శాతం కాగా, వ్యవసాయ రంగానికి సంబంధించిన వారు 6.3 శాతం. నిరుద్యోగులు 8.3 శాతం కాగా, విద్యార్థులు 8.1 శాతం. రోజువారీ కూలీలు అత్యధికంగా 27.5 శాతం ఉన్నారు.

ఉరివేసుకుని..: ఆత్మహత్యల్లో అత్యధికంగా సుమారు 61 శాతం ఉరివేసుకుని మరణించారు. విషం తాగి 25 శాతం మంది, నీట మునిగి 4.1 శాతం, వాహనాల కింద పడి 2.8 శాతం మంది ప్రాణాలు తీసుకున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)