Breaking News

సంతకం చేయి.. లేకపోతే నీ భార్యపై లైంగిక దాడి చేస్తాం..!

Published on Mon, 07/13/2026 - 13:19

వికారాబాదు జిల్లా: కుటుంబ ఆస్తి వివాదం నేపథ్యంలో బాధితుడిపై దాడి చేసి, అతని భార్యపై లైంగిక దాడిచేస్తామని బెదిరించిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. ఆల్విన్ కాలనీ ఫేజ్‌–1లో గుంటి వేణుగోపాల్‌తో పాటు తన సోదరులు శ్రీనివాస్, రవి ఒకే ఇంట్లో ఉంటున్నారు. 

2022లో వీరి తండ్రి నాగభూషణం చనిపోయారు.  కొన్ని రోజుల నుండి శ్రీనివాస్, రవి ఇప్పుడుంటున్న 100 గజాల ఇంటి ప్రాపర్టీ విషయమై రిజిస్ట్రేషన్ చేయించుకొని రుణం తీసుకుంటున్నట్లు దీనికి గాను తన తమ్ముడు వేణుగోపాల్‌ను సంతకం చేయమని కోరారు. దీనికి తాను ఒప్పుకోనని, తనకు రావాల్సిన వాటా చెల్లించిన తర్వాతే ఆస్తి పత్రాలపై సంతకం చేస్తానని వేణుగోపాల్‌ చెప్పడంతో గొడవ మొదలైంది. 

ఈ విషయమై శనివారం మధ్యాహ్నం మాట్లాడాలని వేణుగోపాల్‌ని పిలిచారు. వెళ్లగానే అన్నలు శ్రీనివాస్, రవిలు పిడిగుద్దులు గుద్దుతూ ఆస్తి పత్రాలపై సంతకం చేయాలని వేణుగోపాల్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో పొత్తికడుపు, ఎడమ కాలి బొటనవేలికి గాయాలయ్యాయి. అంతే కాకుండా అడ్డు వచ్చిన బాధితుడి భార్యను అన్న రవి లైంగికదాడి చేస్తామని అసభ్య పదజాలంతో దూషించి తోసేశారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)