Breaking News

అంగన్‌వాడీలో డూప్లికేట్‌ టీచర్‌ లావణ్య..!

Published on Wed, 08/05/2026 - 09:49

మహబూబ్ నగర్ జిల్లా: జడ్చర్ల మున్సిపాలిటీలోని నాగసాల అంగన్‌వాడీ కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన టీచర్‌ స్థానంలో డూప్లికేట్‌ టీచర్‌ విధులు నిర్వహిస్తున్నారు. 9ఏళ్లుగా తంతు కొనసాగుతున్నా.. ఐసీడీఎస్‌ అధికారులు గుర్తించకపోగా.. సమర్ధించటం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన సీడీపీఓ ఘటనపై విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. 

నాగసాల అంగన్‌వాడీ టీచర్‌గా జ్యోతిలక్ష్మి నియమితులైంది. తొలిరోజుల్లో విధులు పర్వాలేదనిపించినా 9ఏళ్లుగా లావణ్య అనే మరో మహిళతో విధులు చేయిస్తుంది. నెలకు రూ.6వేలు ఇచ్చి తనస్థానంలో మరో మహిళతో పనులు చేయిస్తుంది. మొదట్లో ఆయా లేదని సాకుగా.. చెబుతూ లావణ్యతో విధులు చేయించగా.. ఆయా నియమితులైన తరువాత కూడా ఒరిజినల్‌ టీచర్‌ విధులకు రాకుండా డూప్లికేట్‌తోనే కేంద్రం రన్‌ చేస్తుంది. తన స్థానంలో మరొకరిని నియమించి 20మంది చిన్నా రుల జీవితంపై చెలగాటమాడుతుంది. ఈ విష యంలో ఎవరైనా ప్రశ్నస్తే తాను పూర్తిగా తప్పుకుని లావణ్యను టీచర్‌గా పెట్టిస్తానంటూ సమాధానం దాటవేసేది. 

దీంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే 9ఏళ్లుగా డూప్లికేట్‌ టీచర్‌ విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఐసీడీఎస్‌ అధికారులు, సీడీపీఓ, సూపర్‌వైజర్‌ గుర్తించకపోటం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇదే విషయమై ఇటీవల కొందరు సీడీపీఓకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ విచారణ చేయకపోవడం విస్మయం కలిగిస్తుంది. మంగళవారం విషయం మీడియాకు లీక్‌ కావడంతో సీడీపీఓ శోభారాణిని వివరణ కోరగా.. ఫిర్యాదు అందింది వాస్తవమేనని అంగీకరించారు. బుధవారం విచారణ చేస్తామని బదులిచ్చా రు. అప్పటికే సామాజిక మాధ్యమాల్లో విషయం వైరల్‌ కావడంతో వెంటనే నాగసాల అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. 

గ్రామంలో గర్భిణులు, బాలింతలు లావణ్య విధులు నిర్వహిస్తున్న విషయాన్ని చెబుతూనే ఒరిజినల్‌ టీచర్‌ కూడా అప్పుడప్పుడు వస్తారని బదులిచ్చినట్లు తెలిసింది. అంగన్‌వాడీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న లావణ్యను వివరణ కోరగా 9ఏళ్లుగా పనిచేస్తున్నానని, టీచర్‌ నెలకు రూ.6వేలు ఇస్తున్నారని వెల్లడించారు. ఒరిజినల్‌ టీచర్‌ జ్యోతిలక్ష్మిని వివరణ కోరగా.. ఇదేం పెద్ద తప్పని, తనకు నెలకు డబ్బులిస్తున్నానని బదులివ్వటం గమనార్హం. తాను సర్‌ ప్రక్రిలో బిజీగా ఉన్నానని చెప్పటం కొసమెరుపు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తనస్థానంలో మరొకరిని పెట్టి విధులు చేయించిన ఘటనపై పూర్తి విచారణ చేసి ఒరిజినల్‌ టీచర్‌ను నియమించాలని గ్రామస్తులు కొందరు కోరుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని చర్యలు తప్పవని సీడీపీఓ శోభారాణి తెలిపారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)