Breaking News

కామారెడ్డిలో నకిలీ ఐఏఎస్‌

Published on Thu, 11/06/2025 - 07:56

కామారెడ్డి క్రైం: నకిలీ నియామక పత్రంతో వచ్చిన ఓ మహిళ పోస్టింగ్‌ ఇవ్వాలని జిల్లా అధికారులను కలవడం కామారెడ్డి కలెక్టరేట్లో కలకలం సృష్టించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తాను ఐఏఎస్‌ సాధించాననీ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తనను  భూ రికార్డులు, కొలతల విభా గం అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేర్చుకోవాలని మంగళవారం ఓ మహిళ తప్పుడు నియామక పత్రంతో కుటుంబ సభ్యులతో కలసి వచ్చి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ను కలిసింది. నకిలీ నియామక పత్రం అని గుర్తించిన జిల్లా అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

దేవునిపల్లి పోలీసులు సదరు మహిళను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు. ఆమెను హైదరాబాద్‌ కు చెందిన నుస్రత్‌ జహాన్‌గా గుర్తించారు. రెవెన్యూశాఖ రాష్ట్ర కమిషనరేట్‌ నుంచి నియామకపత్రం వచ్చిందని ఆమె చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు.  మహిళపై చీటింగ్, ఫోర్జరీ కేసులను నమోదు చేసి నోటీసులు జారీ చేశామని కామారెడ్డి రూరల్‌ సీఐ రామన్‌ తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆమె గతంలో సివిల్స్‌కు ప్రిపేర్‌ అయినట్టు తెలిసింది. ఆమె ఎందుకు ఇలా చేసిందో ఇంకా స్పష్టత రాలేదు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం ఇలా చేసిందని సమాచారం. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని సీఐ అన్నారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)