Breaking News

చిన్నారుల అశ్లీల వీడియోలు చూశారంటూ బెదిరింపులు

Published on Sun, 01/25/2026 - 04:37

సాక్షి, హైదరాబాద్‌: ‘చిన్నారుల అశ్లీల వీడియోలు చూశారు.. మీపైన ఫిర్యాదు వచ్చింది. మీ ఫోన్‌ నంబర్, ఐపీ అడ్రస్‌లు మా వద్ద ఉన్నాయి. మేము చెప్పినట్టుగా డబ్బులు పంపకపోతే మీపై కేసులు నమోదు చేస్తాం’అని బెదిరింపు ఈ–మెయిల్స్‌తో కూడిన లేఖలను సైబర్‌ నేరగాళ్లు పంపుతున్నారు. కేంద్ర హోంశాఖకు చెందిన ఐ4సీ (ఇండియన్‌ సైబర్‌ క్రైం కో–ఆర్డినేషన్‌ సెంటర్‌) పేరిట దేశవ్యాప్తంగా వేలాది మందికి ఈ తరహా ఈ–మెయిల్స్‌ వస్తున్నాయని తెలిసింది. 

ఈ తరహా మెయిల్స్‌లో అధికారుల పేర్లు, వారి హోదాలు చట్టంలోని సెక్షన్లను కూడా జత చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అమాయకులను మరింత బురిడి కొట్టించేలా పలు దర్యాప్తు సంస్థల లోగోలను పైభాగంలో వాడి నిజమైన నోటీసుల మాదిరిగా వాటిని రూపొందిస్తున్నారని తెలిపారు. 

అయితే ఐ4సీ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, కస్టమ్స్‌తో పాటు ఇతర దర్యాప్తు సంస్థల పేరిట వచ్చే ఈ తరహా ఈ–మెయిల్స్‌ నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరించారు. ఏ ప్రభుత్వ ఏజెన్సీ ఇలాంటి ఈ–మెయిల్స్‌ పంపదని పేర్కొన్నారు. ఇలాంటి అనుమానాస్పద ఈ–మెయిల్స్‌తోపాటు వాటిలోని లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయవద్దని సూచించారు. ఇలాంటి అనుమానాస్పద ఈ–మెయిల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సైబర్‌ క్రైం పోలీసులకు తెలియజేయాలన్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)