Breaking News

సచివాలయంలో ‘ఫేషియల్‌’ హాజరు

Published on Thu, 12/12/2024 - 04:07

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ విధానం  అమల్లోకి రానుంది. సచివాలయ అధికారులు, ఉద్యోగులతోపాటు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు గురువారం నుంచి తమ అటెండెన్స్‌ను ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానంలో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు ఆమె మంగళవారం సచివాలయంలోని అన్ని శాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు. 

సచివాలయ హాజరు విధానంలో కచ్చిత త్వం, సవర్థత, భద్రతను పెంపొందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సచివాలయ ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన ఫేషియల్‌ రికగి్నషన్‌ అటెండెన్స్‌ యంత్రాల ముందు కొన్ని క్షణాల పాటు ఉద్యోగులు నిలబడితే, వారి ముఖకవలికలను గుర్తించి హాజరును నమో దు చేస్తాయి. ఉద్యోగులు, అధికారులందరి వివరాలను ఇప్పటికే ఆ యంత్రాల్లో రికార్డు చేశారు. 

సచివాలయంలోకి ప్రవేశించే సమయంలో, విధులు ముగించుకుని వెళ్లే సమయంలో అటెండెన్స్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో సాంకేతిక సమస్యలొచ్చే అవకాశం ఉండడంతో శనివారం వరకు ఫిజికల్‌ అటెండెన్స్‌ విధానాన్ని సైతం కొనసాగించాలని సీఎస్‌ సూచించారు.
  
త్వరలో జిల్లా, మండల కార్యాలయాల్లో సైతం.. 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ విధానం అమలు చేయా లని, సచివాలయం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి న కొత్తలో సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు. 

తాజాగా సచివాలయంలో అమల్లోకి తీసుకురాగా, త్వరలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సైతం ఫేషియల్‌ రికగి్నషన్‌ విధానాన్ని అమలు చేయనున్నారు.

నేటి నుంచి సెక్రటేరియట్‌లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)