Breaking News

వారసులకు ఉద్యోగాలెప్పుడు?

Published on Wed, 10/16/2024 - 03:29

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)గా పనిచేస్తూ 61 ఏళ్లు నిండిన వారి వారసులకు కారుణ్య నియామకాలిచ్చే ప్రక్రియ నిలిచిపోయింది. వాస్తవానికి, వీరికి ఉద్యోగాలివ్వాలంటూ గత ఏడాది జూలైలోనే ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వుల మేరకు అవసరమైన పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెవెన్యూ సేవల్లో ఉన్న 3,797 మంది వీఆర్‌ఏల వారసులకు అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు ఆర్థిక శాఖ అనుమతి లభించినప్పటికీ రెవెన్యూ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా నియామక ఉత్తర్వులు అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోడ్‌ ముగిసి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా అన్ని రకాలుగా ప్రభుత్వ వర్గాల అనుమతులున్నా తమకు నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం పట్ల వీఆర్‌ఏలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో మంగళవారం జరిగిన ప్రజావాణికి పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ జి.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి డి.దివ్యలకు వినతిపత్రం అందజేశారు. వీఆర్‌ఏల సమస్యలు విన్న ఇద్దరూ సానుకూలంగా స్పందించారు. విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  
మొత్తం 906 దరఖాస్తులు 
కాగా, మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజావాణికి 906 దరఖాస్తులు అందాయి. గృహ నిర్మాణ శాఖ (306), రెవెన్యూ (138), విద్యుత్‌ (138), మైనార్టీ సంక్షేమ శాఖ (134), పంచాయతీరాజ్‌ (130)లతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన 192 దరఖాస్తులు అందినట్టు ప్రజావాణి అధికారులు వెల్లడించారు. 

కాగా, యూరోపియన్‌ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ బంజారాహిల్స్‌కు చెందిన ఓ కన్సల్టెన్సీ తమవద్ద పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసిందంటూ బాధితులు ప్రజావాణికి రాగా, తక్షణమే స్పందించిన చిన్నారెడ్డి సిటీ పోలీస్‌ కమిషనర్‌ సి.వి.ఆనంద్‌కు లేఖరాసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. 

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)