Breaking News

అన్నారం నుంచి నీటి తరలింపునకు కసరత్తు

Published on Sun, 07/07/2024 - 04:32

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్‌ గుండా ఖరీఫ్‌ సీజన్‌లో నీటిని ఎగువకు తరలించడానికి రాష్ట్ర ఇరిగేషన్‌ సాంకేతిక ఉన్నతాధికారుల బృందం శనివారం కసరత్తు చేసినట్లు తెలిసింది. ఈఎన్‌సీ జనరల్‌ గుమ్మడి అనిల్‌కుమార్‌ బృందంతోపాటు సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజెషన్‌ (సీడీఓ) మోహన్‌కుమార్, క్వాలిటీ కంట్రోల్‌ సీఈ వెంకటకృష్ణల బృందాలు, రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డి మేడిగడ్డ (లక్ష్మి) అన్నారం (సరస్వతీ) బరాజ్‌లను పరిశీలించారు. 

ముందుగా అన్నారంలో చేపట్టిన సీపేజీ మరమ్మతు లను పరిశీలించిన అనిల్‌కుమార్‌.. వాటిని త్వరగా పూర్తిచే యాలని ఆదేశించారు. కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌ ద్వారా నీటిని తరలించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న 11 మోటార్ల టెస్ట్‌ రన్‌లు, రిపేర్లు పూర్తిచేసి సిద్ధంగా ఉంచినట్లు అధికారు లకు ఆయనకు చెప్పారని సమాచారం. అదేకాకుండా అన్నా రం బరాజ్‌ పెద్దవాగు, మానేరు వాగులతోపాటు చిన్నచిన్న వాగుల ద్వారా నీటిలభ్యత ఉందని ఇంజనీర్లు ఈఎన్‌సీతో పేర్కొన్నారు. 

ఇప్పటికే అన్నారం బరాజ్‌లో ఉన్న మొత్తం 66 గేట్లను మూసి ఉంచారు. నీటి తరలింపు అంశంపై పరిశీలన చేయాలని ఇంజనీర్లను ఆయా బృందాలు ఆదేశించినట్లు తెలిసింది. మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఎగువ నుంచి ప్రాణహిత ద్వారా 20 వేల క్యూసెక్కులకుపైగా నీరు వస్తోంది. ఉన్నతాధికారుల బృందం వెంట ఎస్‌ఈ కరుణాకర్, ఈఈలు యాదగిరి, తిరుపతిరావు ఉన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)