Breaking News

తీవ్రమైతే.. వర్కవుట్‌ కావు

Published on Wed, 06/11/2025 - 01:16

తీవ్రమైన వర్కవుట్లు,  వ్యాయామాలు కుర్ర  గుండెలకు కూడా మంచివి  కావట. ప్రత్యేకించి బాడీబిల్డింగ్‌పై  మోజున్న వారు, సిక్స్‌ ప్యాక్‌ల  వంటివాటిపై శ్రద్ధ పెట్టేవారు.. తమ చిన్ని గుండెల గురించి మరిచిపోతున్నారు. ఫలితంగా తీవ్రమైన వ్యాయామాల ఒత్తిడి.. గుండె లయ తప్పేలా చేస్తోంది. ఇది  ‘యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌’ చెబుతున్న మాట. ఫిట్‌నెస్, బాడీబిల్డింగ్‌ కోసం కఠోర శ్రమ చేసేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ అధ్యయనం హెచ్చరించింది. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

అమెరికాకు చెందిన ప్రముఖ మహిళా బాడీ బిల్డర్‌ జోడీ వాన్స్‌.. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఈ ఏడాది మార్చిలో గుండెపోటుతో కన్నుమూసింది. బాడీబిల్డింగ్‌లో భాగంగా శరీరాన్ని తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురిచేయడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తేల్చారు. 

కార్డియాక్‌ అరెస్ట్‌తో కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం!
మిస్టర్‌ తమిళనాడు టైటిల్‌ విన్నర్, ప్రముఖ బాడీ బిల్డర్‌ యోగేష్‌ గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు.
ఈ జాబితా చాలా పెద్దదే. అందరి మరణాలకూ సాధారణ కారణం.. గుండెపోటు.
వీళ్లందరి హృదయాలకూ ఉమ్మడి శత్రువు.. అతి వ్యాయామం, తీవ్రమైన వర్కవుట్లు.

బాడీ బిల్డింగ్‌ మోజు
బాడీ బిల్డింగ్‌ అంటే కుర్రాళ్లకు భలే మోజు. కండలు పెంచడం.. సిక్స్‌ ప్యాక్‌.. చాలామందికి ఒక ప్యాషన్‌. వర్కవుట్లు, జిమ్, వ్యాయామం.. జెన్‌ జెడ్‌ (1997–2012 మధ్య పుట్టినవాళ్లు) తరంలో చాలామందికి, జెన్‌ వై (1981–1996 మధ్య పుట్టినవాళ్లు) తరంలో కొందరికి దినచర్యలో భాగం. సాధారణ వ్యాయామం చేసేవాళ్లకు ఫర్వాలేదుగానీ.. తీవ్రమైన వర్కవుట్లు చేసేవాళ్లకు, బాడీబిల్డర్లకు మాత్రం.. అది వారి శారీరక సౌందర్యాన్ని పెంచాల్సింది పోయి.. ప్రాణాలు తీస్తోంది.

మరికొందరు బరువు తగ్గే క్రమంలో డీహైడ్రేషన్‌కు గురవడం, కఠినమైన ఆహార నిబంధనలు పాటిస్తూ హృదయ సంబంధ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. గుండెపోటు వల్ల హఠాన్మరణం అన్నది యువకులలో, ఆరోగ్యంగా ఉండేవారిలో అరుదే అయినప్పటికీ బాడీబిల్డింగ్‌ ప్రొఫెషన్‌లో ఉండేవారికి ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లు ‘యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌’ ప్రచురించిన అధ్యయన పత్రం పేర్కొంది. 

బాడీ బిల్డర్లకూ ముప్పే
స్టేజీ ఎక్కి కండరాల ప్రదర్శన చేయటమే బాడీబిల్డర్‌ల పని అనుకుంటాం కానీ... అంత తీరుగా, అంత దృఢంగా, అందరిలోనూ ఒకే ఒక్కడిలా, అంతిమ విజేతగా నిలిచేందుకు వారు పడే శ్రమ, చేసే సాధన ఎంత కఠినమైనవో.. వారి గుండెకు మాత్రమే తెలుస్తుంది. మరి అంత ఒత్తిడిని ఆ గుండె తట్టుకోగలుగుతోందా అని గమనించకపోతే ఏమవుతుంది? సంకేతం ఇవ్వకుండానే సెలవు తీసుకుంటుంది.  

ప్రపంచవ్యాప్తంగా పురుష బాడీబిల్డర్లలో ఆకస్మిక మరణాలకు గుండె పోట్లే ప్రధాన కారణం అవుతున్నాయని ‘యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌’ వెల్లడించింది. ఈ అధ్యయనానికి ఇటలీలోని పడోవా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ మార్కో వెచియాటో నేతృత్వం వహించారు.

సుదీర్ఘ అధ్యయనం
అధ్యయనం కోసం డాక్టర్‌ వెచియాటో, ఆయన బృందం అధికారిక బాడీబిల్డింగ్‌ పోటీల రికార్డులు, అనధికారిక ఆన్ లైన్‌ డేటాబేస్‌ నుండి 20,286 మంది పురుష బాడీబిల్డర్ల పేర్లను సేకరించారు. వారంతా 2005 – 2020 మధ్య కనీసం ఒక అంతర్జాతీయ ఫిట్‌నెస్‌  ఈవెంట్‌లో పాల్గొన్నవారే. 

ఆ తర్వాత మీడి­యా నివేదికలు, సోషల్‌ మీడియా, బాడీబిల్డింగ్‌ ఫోరమ్‌లు, బ్లాగుల వంటి వివిధ వెబ్‌ సైట్‌లలో ఐదు వేర్వేరు భాషలలో తమ జాబితాలో ఉన్న  పోటీదారులలో మరణించిన వారెవరైనా ఉన్నారా అని శోధించారు. తమ దృష్టికి వచ్చిన వారి మరణాలను వివిధ వనరులను ఉపయోగించి జాగ్రత్తగా పోల్చి చూసుకున్నారు. ఆ డేటాను ఇద్దరు క్లినికల్‌ వైద్యులకు సమర్పించి ఆ మరణాలకు కారణాలను నిర్ధారించుకున్నారు. 

ప్రొఫెషనల్‌ బాడీబిల్డర్‌లలో ఎక్కువ..: డాక్టర్‌ వెచియాటో బృందం పురుష బాడీబిల్డర్లలో సంభవించిన 121 మరణాలను కనుగొన్నారు. వారి సగటు మరణ వయస్సు 45 సంవత్సరాలు. వారిలో 38 శాతం మంది గుండె సంబంధ కారణాలతో మరణించినవారే. ముఖ్యంగా ఆకస్మిక గుండెపోట్ల ప్రమాదం ప్రొఫెషనల్‌ బాడీబిల్డర్లలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నాన్‌–ప్రొఫెషనల్స్‌తో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ. బాడీబిల్డింగ్‌లో ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలు అనేకం ఉంటాయి. కఠినమైన కండర శిక్షణ, తీవ్రమైన ఆహార నియమాలు, డీహైడ్రేషన్, వేగంగా బరువును తగ్గించే వ్యాయామాలు, కండర సామర్థ్యాన్ని పెంచే మందులను అతిగా వాడకం.. వాటిలో ప్రధానమైనవి.

బాడీబిల్డర్లూ.. పారాహుషార్‌..: బాడీబిల్డింగ్‌ ప్రక్రియలో శరీరం తీవ్రమైన మార్పులకు లోనవుతుంది. ఆ ప్రభావం గుండెపై పడుతుంది. అందువల్ల సుశిక్షుతులైన వారి మార్గదర్శకత్వంలో.. సురక్షితమైన శిక్షణా విధానాలు పాటించాలి. మెరుగైన వైద్య పర్యవేక్షణలో ఉండాలి. కండర సామర్థ్యాన్ని పెంచే ఔషధాలకు అలవాటు పడకూడదు.

బాడీబిల్డర్‌ల విషయంలో పైకి ఆరోగ్యంగా కనిపించేదంతా నిజమైన ఆరోగ్యం కాకపోవచ్చని, తీరైన ఆ శరీరాకృతి వెనుక కూడా ప్రమాదం దాగి ఉండొచ్చని ఈ పరిశోధన సూచిస్తోంది.  ప్రొఫెషనల్‌ బాడీ బిల్డర్స్‌లో ఎక్కువ మంది పురుషులే కాబట్టి పరిశోధకులు వారిపైనే దృష్టి సారించారు. మహిళా బాడీబిల్డర్లపైనా ఇలాంటి అధ్యయనం చేయబోతున్నారు.

బాడీబిల్డింగ్‌ మంచిదే కానీ...!
క్రీడలు, వ్యాయామ వైద్యుడిగా నేను బాడీబిల్డర్‌లను చాలా దగ్గరగా చూశాను. బాడీబిల్డింగ్‌ అనేది ఫిట్‌నెస్‌ను, స్వీయ–క్రమశిక్షణను ప్రోత్సహించడం వంటి అనేక సానుకూల అంశాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, అంతర్లీనంగా కొన్ని ఆరోగ్య సవాళ్లను, ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టడాన్ని నేను గుర్తించాను. బాడీబిల్డింగ్, ఫిట్‌నెస్‌ సాధనలో ఉన్నవారిలో అకాల మరణాలు పెరుగుతున్నట్లు కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్న అథ్లెట్లలో కూడా ఇలా జరిగిన సంఘటనలు ఉన్నాయి.  –  డాక్టర్‌ మార్కో వెచియాటో

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)