Breaking News

కొండలు పగులగొట్టి.. కోట్లు కొల్లగొట్టి..

Published on Sun, 08/04/2024 - 05:15

సాక్షి, హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో గ్రానైట్‌ అక్రమ తవ్వకాలపై హైకోర్టు సోమవారం  విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తికి కరీంనగర్‌ వాసి డి.అరుణ్‌కుమార్‌ రాసిన లేఖపై హైకోర్టు సుమోటోగా విచారణ జరిపేందుకు నిర్ణయించింది. ‘కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో గ్రానైట్‌ క్వారీలతో పరిసర ప్రాంతాల్లో పర్యావరణం అధ్వానంగా మారింది. అక్కడి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. 

విచ్చలవిడిగా, అక్రమంగా గ్రానైట్‌ తవ్వకాలతో పాటు అనుబంధ పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండటంతో పర్యావరణ కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. గ్రానైట్, స్టోన్‌ కటింగ్, పాలిషింగ్‌ యూనిట్లతో గాలి మాత్రమే కాకుండా నీరు, ధ్వని కాలుష్యం పెరిగిపోయింది. పరిశ్రమల నుంచి వెలువడే ధూళి కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లో పచ్చదనం మాయమైంది. శ్వాస పీల్చుకోవడానికి మనుషులే కాదు.. జంతువులు సైతం ఇబ్బందిపడుతున్నాయి’ అని లేఖలో పేర్కొన్నారు.

పశువులకు మేత లేదు..
‘గ్రానైట్‌ యజమానులకు గుట్టలు బంగారు కొండల్లా మారాయి. గ్రానైట్‌ అక్రమ తవ్వకాలు జరపడమే కాకుండా నిబంధనలు పాటించకుండా పర్యావరణ హననానికి పాల్పడుతున్నారు. చుట్టూ పంటలు పండక, చెట్లు సరిగ్గా పెరగక, పశువులకు మేత లేక చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. గనుల్లో భారీ బ్లాస్టింగ్‌లు, కాలుష్య కారకాలకు 10కి పైగా గ్రామాలు ప్రభావితమయ్యాయి. సుమారు 40 వేల మంది జీవితాలు ప్రమాదకరంగా మారాయి. దీనిపై వెంటనే చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలి’ అని పిటిషనర్‌ కోరారు. 

విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనులు, పరిశ్రమలు, వాణిజ్య, పర్యావరణ, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శు లతో పాటు కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్, తదితరులను ప్రతివాదులుగా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై రేపు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టనుంది.   

Videos

రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు