Breaking News

పరీక్షలు ముగిశాయి.. ఫలితాలే తరువాయి.. 

Published on Sat, 05/13/2023 - 03:42

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లోని వివిధ తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీలు, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షల నిర్వహణ ఈనెల 10తో ముగిసిఇంది. నాలుగు సొసైటీల పరిధిలో అర్హత పరీక్షలన్నీ ముగియడంతో ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మైనార్టీ గురుకుల సొసైటీ మినహా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీఎంఆర్‌ఈఐఎస్, టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌లు ఐదోతరగతితో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాయి.

వీటితో పాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీలకు సొసైటీలు వేర్వేరుగా అర్హత పరీక్షలు నిర్వహించాయి. జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సైతం ఏ సొసైటీకా సొసైటీ అర్హత పరీక్షలు ముగిశాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలోని సైనిక పాఠశాలల్లో ప్రవేశాలు, బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అగ్రికల్చర్‌ డిగ్రీ, ఫ్యాషన్‌ టెక్నాలజీ డిగ్రీ ప్రవేశాలు, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సొసైటీ(ఈఎంఆర్‌ఎస్‌)లో ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేకంగా సెట్‌ నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలన్నీ వరుసగా విడుదల చేసేందుకు ఆయా సొసైటీలు సన్నద్ధమయ్యాయి. 

అర్హత పరీక్షల ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేసేందుకు గురుకుల సొసైటీలు సన్నద్ధమవుతున్నాయి. ముందుగా పాఠశాలల్లో ప్రవేశాల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఐదో తరగతి అడ్మిషన్లకు నిర్వహించిన వీటీజీసెట్‌–2023 ఫలితాలను వచ్చే వారాంతంలో విడుదల చేయనున్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)