Breaking News

నా ఆరోగ్యం ఆందోళనకరం

Published on Mon, 09/22/2025 - 08:08

సాక్షి, హైదరాబాద్‌/భువనగిరి: తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఫేస్‌బుక్‌ ద్వారా ఆదివారం పంచుకున్న ఒక బహిరంగ లేఖ చర్చనీయాంశమైంది. మరణ వాంగ్మూలం అంటూ పేర్కొన్న ఈ పోస్టులో తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించారు. ఫేస్‌బుక్‌ పోస్టులో నళిని పేర్కొన్న ప్రకారం.. ‘ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆ­యు­ర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజు­లుగా సీరియస్‌గా ఉంది. 8 ఏళ్ల క్రితం సోకిన రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అనే కీళ్ల జబ్బు, రెండు నెలలుగా ఫీవర్‌ వైరస్‌ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. 2018లో ఈ జబ్బు రాగా, హరిద్వార్‌ వెళ్లి రాందేవ్‌ బాబా పంచకర్మ సెంటర్‌లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక, డబ్బు లేదు’అని పేర్కొన్నారు. 

నా గతమంతా వ్యథాభరితం 
‘నా గతమంతా వ్యథాభరితం. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహం లోంచి బయట పడితే, డిపార్ట్‌మెంట్‌ నా వెన్ను­లో సస్పెన్షన్‌ అనే బల్లెంను కసి తీరా దింపింది. మహర్షి దయానందుని దయవల్ల యజ్ఞ బ్రహ్మ­గా వీవైపీఎస్‌ (వేదయజ్ఞ పరిరక్షణ సమితి)సంస్థాపకురాలిగా ఎదిగాను. ఇలాంటి తరుణంలో నేటి సీఎం (రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి) అధికారంలోకి రాగానే నా ఫైల్‌ తెరిచారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్‌పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్‌ అలవెన్స్‌ లెక్కకట్టి (సుమారు రూ.2 కోట్లు) ఇవ్వండి అని ఓ లేఖ ఇ­చ్చా­ను. 

ఆరు నెలల తర్వాత నా పిటిషన్‌ పొజిషన్‌ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైంది అని తెలిసింది. నా ఆఫీస్‌ కాపీని మళ్లీ స్కాన్‌ చేసి పంపినా, స్పందన లేదు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి..నేను చస్తే ఎవరూ సస్పెండెడ్‌ ఆఫీసర్‌ అని రాయకండి. దేశ ప్రధాని నరేంద్రమోదీని కలవలేక పోయాను. నా మర­ణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అ­ను­కుంటే మా వేదామృతం ట్రస్ట్‌కు ఇవ్వవలసిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్లీ జన్మలో కొనసాగిస్తాను..సెలవిక మిత్రులారా ’అని నళిని పేర్కొన్నారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)