Breaking News

మద్యం తాగించి ఈవెంట్ డ్యాన్సర్‌పై లైంగిక దాడి

Published on Thu, 06/26/2025 - 07:44

గచ్చిబౌలి: వైన్‌ షాపు ముందు పరిచయమైన ఓ యువకుడు అతిగా మద్యం తాగించి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ వెంకన్న తెలిపిన ప్రకారం..సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈవెంట్లలో డ్యాన్సర్‌గా పని చేసే ఓ యువతి (23) గచ్చిబౌలి జంక్షన్‌లోని వైన్‌ షాపు వద్ద మద్యం తాగుతోంది. కుక్‌గా పనిచేసే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రకాష్‌ (32) అదే వైన్‌ షాపు వద్దకు వచ్చాడు.

 మద్యం తాగుతున్న యువతిని పరిచయం చేసుకొని..ఇలా రోడ్డుపై తాగితే మంచిది కాదని చెప్పాడు. దగ్గర్లోనే తన రూమ్‌ ఉందని నమ్మించి వెంట తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం తాగి నిద్రపోయారు. రాత్రి 2 గంటలకు యువతికి మెళకువ రావడంతో లేవగా..ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా ఉంది. దీంతో ఆ యువతి మోసం చేశావంటూ ప్రకాష్‌ తో గొడవకు దిగింది. తెల్లవారే వరకు అక్కడే ఉండాలని ప్రకాశ్‌ తన మొబైల్‌లో తీసిన యువతి న్యూడ్‌ ఫొటోలు చూపించాడు. 

ఎవరికి చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ ఫొటోలు అందరికి పంపిస్తానని బెదిరించాడు. అయినా యువతి మాత్రం తాను ఇక్కడ ఉండనని గొడవ పడి ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అతిగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసి నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   

#

Tags : 1

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)