Breaking News

నేడు పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందుకు ఈటల

Published on Fri, 06/06/2025 - 01:29

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను ప్రశ్నించనుంది. ఏడాది కాలంగా విచారణ జరుపుతున్న కమిషన్‌ ఎదుట ఓ ముఖ్య నేత హాజరై వాంగ్మూలనం ఇవ్వనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తొలి దఫా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్‌ పనిచేసినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాలు జరిగాయి.

బరాజ్‌ల నిర్మాణం సైతం అప్పుడే ప్రారంభమై పూర్తయ్యింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని తీసుకున్న నిర్ణయంతో పాటు ప్యాకేజీలవారీగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు ఆర్థిక అనుమతులు, ఆ తర్వాత పనుల అంచనాల సవరణకు అనుమతి, రుణ సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఐపీసీఎల్‌) స్థాపనకు అనుమతుల జారీలో నాడు ఆర్థిక శాఖ కీలకంగా వ్యవహరించింది. ఈ నిర్ణయాల్లో ఈటల రాజేందర్‌ పాత్రపై ఆయన్ను కమిషన్‌ ప్రశ్నించే అవకాశం ఉంది.

ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కమిటీలకు ఈటల నేతృత్వం వహించగా, మరికొన్ని కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించింది. ఈ వ్యవహారాల్లో ఆయ న పాత్రపై కమిషన్‌ ప్రశ్నించనుంది. కమిషన్‌ ఎదుట ఈటల ఇవ్వనున్న వాంగ్మూలం కీలకంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, కమిషన్‌ ఈ నెల 9న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ను, 11న మాజీ సీఎం కేసీఆర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాలని కోరింది. వారికి ఇప్పటికే సమన్లు పంపించింది. వాస్తవానికి ఈ నెల 5నే కేసీఆర్‌ను ప్రశ్నించేందుకు కమిషన్‌ సమన్లు పంపగా, ఆయన అనారోగ్య కారణాలు చూపి మరి కొంత సమయం కోరారు. దీంతో 11వ తేదీన రావాలని కోరింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)