Breaking News

‘ఈపీఎఫ్‌ఓ’ మెంబర్‌ పోర్టల్‌ నవీకరణ

Published on Sat, 07/04/2026 - 02:54

సాక్షి, హైదరాబాద్‌: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌ఓ) యూనిఫైడ్‌ మెంబర్‌ పోర్టల్‌ను మరింత ఆ«ధునీకరించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన సామాజిక భద్రత కోడ్‌లో భాగంగా ఉద్యోగుల భవిష్యనిధి పథకం–2026, ఉద్యోగుల పింఛను పథకం–2026, ఉద్యోగుల డిపాజిట్‌ బీమా పథకం–2026 గత నెల 29నుంచి అమల్లోకి వచ్చాయి. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేయగా... వీటి అమలుకు ఈపీఎఫ్‌ఓ ముమ్మర కసరత్తుచేసింది. ఇందులో భాగంగా గతవారం రోజులుగా యూనిఫైడ్‌ మెంబర్‌ పోర్టల్‌ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ చేపట్టిన ఈపీఎఫ్‌ఓ తాజాగా నవీకరించిన పోర్టల్‌ను చందాదారులకు అందుబాటులోకితెచ్చింది.

తాజాగా అప్‌గ్రేడ్‌ చేసిన పోర్టల్‌లో మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈమేరకు అధికారులు వ్యూహాత్మక కార్యాచరణతో పోర్టల్‌ అప్‌గ్రెడేషన్‌ పూర్తి చేశారు.

⇒ ఉద్యోగంలో చేరిన వ్యక్తికి ఈపీఎఫ్‌కు సంబంధించి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను యూఏఎన్‌ అంటారు. దీన్ని ఇదివరకు ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌ ద్వారా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఈ సౌకర్యాన్ని ఇప్పడు ఉమాంగ్‌(కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలను ఒకేచోట పొందేందుకు భారత ప్రభుత్వం రూపొందించిన డిజిటల్‌ వేదిక)యాప్‌ ఆధారంగా యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి యాక్టివేషన్‌ చేసుకున్న తర్వాత ఆ ఉద్యోగి రిటైర్మెంట్‌ వరకు అదే యూఏఎన్‌ను కొనసాగించాల్సి ఉంటుంది.

⇒ ఉమాంగ్‌ యాప్‌లో ఆధార్‌ ఆధారిత, ఫేస్‌ అథెంటికేషన్‌(ఎఫ్‌ఏటీ) ద్వారా యాక్టివేషన్‌ చేసుకోవాలి. నూతన యూఏఎన్‌ జనరేషన్‌ కూడా ఉమాంగ్‌ యాప్‌ ద్వారానే చేసుకోవాలి. అదేవిధంగా యూఏఎన్‌ రిట్రీవ్‌ చేసుకోవడం సులభతరమైంది. యూఏఎన్‌ నంబర్‌ మర్చిపోయినట్లైతే సభ్యులు ఆధార్, ఇతర వివరాలతో సులభంగా తిరిగి పొందే విధంగా కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

⇒ మరణించిన సభ్యుడి పీఎఫ్‌ క్లెయిమ్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు సదుపాయం పోర్టల్‌లో యథాతథంగా కొనసాగుతోంది.
⇒ ఈపీఎఫ్‌ఓ హోమ్‌పేజీని పూర్తిగా మార్చి, క్లెయిమ్‌లు, పాస్‌బుక్, కేవైసీ, ప్రొఫైల్‌ సేవలను సులభంగా కనిపించేలా రూపొందించారు.
ప్రస్తుతం పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ముఖ్య సేవలు: పీఎఫ్‌ పాస్‌బుక్‌ చూసుకోవడం, క్లెయిమ్‌ దాఖలు, క్లెయిమ్‌ స్టేటస్‌ ట్రాకింగ్, కేవైసీ నవీకరణ, ప్రొఫైల్‌ వివరాల సవరణ, పెన్షన్‌కు సంబంధించిన సేవలు.

⇒ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడం, భద్రతను పెంచడం, డిజిటల్‌ సేవలను ఒకే వేదికలో మరింత సమర్థంగా అందించడం తాజా మార్పుల ముఖ్య ఉద్దేశ్యం. భవిష్యత్తులో మరిన్ని ఆన్‌లైన్‌ సేవలను చేర్చేందుకు సాంకేతిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈపీఎఫ్‌ఓ చర్యలు చేపట్టింది.
⇒ తాజాగా మెంబర్‌ పోర్టల్‌ అందుబాటులోకి రాగా... మిగిలిన సర్వీసులను విడతల వారీగా తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్‌ఓ వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)