Breaking News

ఆ పెన్ను, పేపర్ నాటితే మొక్క

Published on Sat, 03/29/2025 - 04:08

పరిచయ కార్యక్రమంతో అంకురార్పణ 
కొద్దిరోజుల క్రితం నగరంలో ప్రపంచ సుందరి పోటీల పరిచయ కార్యక్రమం జరిగింది. మిస్‌ వరల్డ్‌ సంస్థ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లేతోపాటు 2024 ప్రపంచ సుందరి క్రిస్టీనా పిస్కోవాల బృందం నగరానికి వచి్చంది. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల పరిచయ కార్యక్రమంలో పర్యావరణ అనుకూల, మట్టిలో నాటే నోట్‌ ప్యాడ్, పెన్నులు అందించారు.

ఇలా నాటాలి..
నోట్‌ ప్యాడ్‌ అట్ట భాగాల్లో బంతి గింజలు చేర్చారు. వాడేసిన తర్వాత ఆ కాగితాన్ని నీటిలో తడిపి ముద్ద చేసి మట్టిలో కప్పేయాలి. నీళ్లు పోస్తుంటే ఆ ప్రాంతంలో బంతి మొక్కలు పెరుగుతాయి.  

   పెన్ను చివరి భాగంలో మొక్కజొన్న గుజ్జుతో రూపొందించిన ప్లాస్టిక్‌ భాగం ఉంటుంది. అందులో టమాటా, బెండ, వంగ, పాలకూర, ఆవాలు లాంటి గింజలు ఉంచుతారు. పెన్ను భాగాన్ని రీసైకిల్డ్‌ పేపర్‌ కార్డ్‌తో తయారు చేస్తారు. వినియోగించిన తర్వాత రీఫిల్‌ తొలగించి పెన్నును మట్టిలో కలిపేస్తే మొక్క చిగురిస్తుంది. మొక్కజొన్న వ్యర్థాలతో రూపొందించిన ప్లాస్టిక్‌ కావటంతో అది నిమిషాల్లోనే తడి మట్టిలో కరుగుతుందని తయారీ దారులు పేర్కొంటున్నారు.  

పర్యావరణానికి ఎంతో మేలు  
కాగితం, పెన్నుల తయారీలో పర్యావరణ అనుకూల విధానాలను మేం అలవంభిస్తున్నాం. ఇప్పుడు పర్యాటక శాఖకు అలాంటివి మిస్‌ వరల్డ్‌ కోసం సరఫరా చేస్తున్నాం. వినియోగించిన కాగితాలను రీసైక్లింగ్‌తో తిరిగి తయారు చేస్తున్నందున, చెట్లను రక్షించినట్టు కావటంతోపాటు, కెమికల్స్‌ వాడటం, నీళ్లు, విద్యుత్‌ వినియోగాన్ని నియంత్రించటం సాధ్యమవుతుంది. 8 వేల కాగితాల తయారీకి ఒక చెట్టు కలపను వాడాల్సి వస్తుంది. పునరి్వనియోగంలో చెట్టుతో పనిలేదు. విద్యార్థి ఓ విద్యాసంవత్సరంలో సగటున 80 పెన్నులు వాడతాడు. పర్యావరణ అనుకూల పెన్నుల వినియోగంతో అంతమేర ప్లాస్టిక్‌ను నియంత్రించొచ్చు. ఇక రీసైక్లింగ్‌లో కెమికల్స్‌ అసవరం ఉండదు. నీళ్లు, కరెంటు వినియోగం బాగా తగ్గుతుంది. టీ–హబ్‌ కేంద్రంగా మా పరిశోధనలు సాగుతున్నాయి.  – అక్షయ్‌ దేశ్‌పాండే, స్విచ్‌ ఎకో సంస్థ

ప్రపంచస్థాయి వేడుక ద్వారా మంచి సందేశం
ప్రపంచస్థాయి పోటీలను వీలైనంతమేర పర్యావరణ అనుకూల పద్ధతుల్లో నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకే పర్యాటక శాఖ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ఈ తరహా పేపర్, పెన్నుల వినియోగానికి ప్లాన్‌ చేశారు. దీని ద్వారా ప్రజల్లోకి పర్యావరణ హిత సందేశం చేరుతుందని భావిస్తున్నాం.      – మామిడి హరికృష్ణ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)