Breaking News

ఇంగ్లిష్‌ రాకనే గుమస్తాలయ్యాం

Published on Wed, 05/21/2025 - 04:46

సాక్షి, హైదరాబాద్‌: ‘విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుతోపాటు ఇంగ్లిష్ ను కూడా బోధించాలి’అని ప్రముఖ సినీ నటుడు, దర్శక–నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘తెలుగు వన్‌’యూట్యూబ్‌ చానల్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచంలో తెలుగువాడు ముందుండాలి అన్న ఆలోచనతో తెలుగు వన్‌ను స్థాపించిన రవిశంకర్‌కు అభినందనలు. ఈ చానల్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నారు. 

నేను తెలుగువాణ్ణి అంటూ తెలుగు ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌. మనం తెలుగువాళ్లమే. మన మాతృభాష తెలుగు గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. ఈరోజు ప్రపంచం గ్లోబలైజేషన్‌ అయిపోయింది. ఉద్యోగాలు కావాలంటే అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్‌ కావాలి.. ఇంగ్లిష్‌ రావాలి. అమ్మ భాష మాతృ భాష తెలుగు అయితే, నడిపించే నాన్న భాష ఇంగ్లిష్. మేము పేదవాళ్లం. అందరికీ న్యూటన్‌ లాగానో, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ లాగానో ఐక్యూ చాలా గొప్పగా ఉండదు. అందరూ చదువుకోవాలి. 

మా ఊర్లో బీఏ చదివిన మొదటి వ్యక్తిని నేను. ఆ రోజుల్లో నాలాంటి పేదవాళ్లందరికీ ఇంగ్లిష్‌ రాక ఫెయిల్‌ అయ్యాం. ప్రాథమికస్థాయి నుంచి మాకు ఎప్పుడూ ఇంగ్లిష్‌ లేదు. మేం బీఏ, ఎంఏ, ఎంకామ్‌.. ఇలా అన్నీ పాస్‌ అయ్యాం. ఉద్యోగాల కోసం పరీక్ష రాసేందుకు వెళితే అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్‌ లో ప్రశ్న పత్రాలు ఉండటం వల్ల మాకు అర్థం కాక ఫెయిల్‌ అయ్యాం. దీంతో గుమస్తాలు అయ్యాం.. ప్యూన్‌లు అయ్యాం.. అటెండర్లు అయ్యాం. ఈ దేశ సార్వ¿ౌమాధికారాన్ని కాపాడే జవాన్‌లు అయ్యాం. 

ఈ దేశంలో శాంతి భద్రతలు కాపాడే పోలీసులం అయ్యాం. కానీ ఇంగ్లిష్‌ మీడియం వచ్చిన వారు ఏమయ్యారు? కలెక్టర్లు, ఇంజినీర్లు, డాక్లర్లు అయ్యారు.. చాలా సంతోషంగా ఉంది. కానీ, విద్య ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుందని అంబేద్కర్‌గారు చెప్పారో.. తెలుగు, ఇంగ్లిష్‌ అనే భేదం వల్ల ఇంగ్లిష్‌ వచ్చినవాళ్లు చాలా గొప్పవాళ్లు అయిపోయారు. తెలుగు వచి్చనవారు అథఃపాతాళానికి వెళ్లారు. అది కాకుండా ఉండాలంటే.. విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుతో పాటు ఇంగ్లిష్ ని కూడా బోధించాలని నేను కోరుకుంటున్నాను’అని నారాయణమూర్తి తెలిపారు.    

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు