Breaking News

కబ్జా చేసి.. పట్టా భూమిలో కలిపేసి..

Published on Sun, 07/14/2024 - 05:57

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో విలువైన భూదాన్‌ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మహేశ్వరం మండలంలోని రూ.180 కోట్ల విలువ చేసే భూదాన్‌ భూమి మాయమైంది. బోర్డు పేరున భూమి ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో భూమి కనిపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిలో బోర్డులు నాటి, చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఏళ్ల తరబడి అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో విలువైన ఈ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.  

భూదాన్‌ భూమి...
మంఖాల్‌ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 435లో 12.17 ఎకరాల భూమి ఉంది. 1955–58 పహాణీ ప్రకారం ఈ భూమి ఫకీర్‌ మహ్మద్‌ పేరున ఉంది. ఆయన దీనిని 3/1/1979న (ప్రొసీడింగ్‌ నంబరు: 1585/79 ) భూదాన్‌ బోర్డుకు దానం చేశారు. 1979–80 నుంచి 1985–86 వరకు భూదాన్‌ సమితి పేరున ఈ భూమి రికార్డుల్లో ఉంది.

ఆ తర్వాత ఈ భూమిని ప్రభుత్వం స్థానికంగా ఉన్న ఐదుగురు పేదలకు దానం చేసింది. ఆ తర్వాత ఈ భూమి పక్కనే ఉన్న ఓ పట్టాదారు ఆధీనంలోకి వెళ్లింది. సదరు రైతు ఈ భూదాన్‌ భూమిని తన పట్టా భూమిలో కలిపేసుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి పంట సాగు చేస్తున్నాడు. 

నివేదికతో సరి...
అసైన్‌దారుల ప్రమేయం లేకుండా రికార్డుల్లో పేర్లు మారడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిని అప్పట్లో ఏపీ లోకాయుక్త సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశాన్ని సుమోటో (కేసు నంబరు: 2585/2011)గా స్వీకరించింది. రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో మహేశ్వరం తహసీల్దార్‌ సదరు కబ్జాదారుకు రికార్డులు చూపించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. 

ఇందుకు ఆయన నిరాకరించడంతో 14/2/2012లో ఈ భూమిని తమ ఆ«దీనంలోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశాన్ని లోకాయుక్తకు కూడా నివేదించింది. ఈ భూమిలో హెచ్చరికల బోర్డు కూడా ఏర్పాటు చేసింది. అయితే కబ్జాదారు దీనిని కూలి్చవేయగా, తహసీల్దార్‌ ఫిర్యాదుతో మహేశ్వరం పీఎస్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. కానీ ఇప్పటివరకు ఆ భూమిని స్వా«దీనం చేసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

పోరంబోకు..పట్టాగా మంఖాల్‌ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 608, 609, 610లలో 33.8 ఎకరాల పోరంబోకు భూమి ఉంది. నిన్నమొన్నటి వరకు పేదల చేతుల్లో ఉన్న ఈ భూములు ఇటీవల పెద్దల చేతుల్లోకి వెళ్లాయి. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ రూ.300 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. 1996 నుంచి ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూములు పోరంబోకు/గైర్హాన్‌ సర్కారివిగా నమోదై ఉన్నాయి. 2012లో ప్రభుత్వం వీటిని నిషేధిత జాబితా (22ఎ)లో చేర్చింది. 

ఆ మేరకు ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. విలువైన ఈ భూములపై కన్నేసిన కొంతమంది బడానేతలు రికార్డులు మాయం చేసి గుట్టుగా వీటిని కాజేశారు. అసలు సర్వే నంబర్లకు అనేక బై నంబర్లు సృష్టించగా, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. ఏడాదిక్రితం వరకు నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములు ఇటీవల పట్టా భూములుగా మారడంపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందగా, ఆయన విచారణకు ఆదేశించడం కొసమెరుపు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)