Breaking News

ఇసుక పక్కకు జరగడం వల్లే..

Published on Thu, 10/26/2023 - 01:45

సాక్షి, హైదరాబాద్‌: ఫౌండేషన్ కింద ఇసుక పక్కకు జరగడంతోనే ఖాళీ ఏర్పడి మేడిగడ్డ బ్యారేజీ పియర్‌ కుంగిందని, పైనుంచి చూడడం ద్వారా ఈ మేరకు ప్రాథమిక అంచనాకు వచ్చామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్‌) సి.మురళీధర్‌ తెలిపారు. బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత కిందికి దిగి ఫౌండేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తేనే పూర్తిగా స్పష్టత వస్తుందని అన్నారు. ‘ఎక్కడో చిన్నలోపం జరిగి ఉండొచ్చు. ఇందులో సందేహం లేదు. లేకుంటే ఇలా ఎందుకు జరిగేది? ’అని వ్యాఖ్యానించారు. బ్యారేజీ డిజైన్లు, నాణ్యతలో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు.

డిజైన్లలో లోపంతోనే బ్యారేజీ కుంగిందని వచ్చిన విమర్శలను కొట్టిపారేశారు. గతేడాది జూలైలో 25 లక్షల క్యూసెక్కుల భారీ వరద వచ్చినా బ్యారేజీ తట్టుకుని నిలబడిందని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన ఘటనపై అధ్యయనం కోసం నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ చైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఈఎన్‌సీ మురళీధర్‌తో సమావేశమై విస్తృతంగా చర్చించింది. అనంతరం మురళీధర్‌ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్‌ కుంగడంతో పగుళ్లు వచ్చాయని, ర్యాఫ్ట్‌కూ నష్టం జరిగిందని చెప్పారు.

పూర్తి బాధ్యతతో బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేస్తామని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ హామీ ఇచ్చిందని తెలిపారు. బ్యారేజీలోని నీటి నిల్వలను ఖాళీ చేశామని, ఎగువ నుంచి వచ్చే వరదను దారి మళ్లిస్తామని వివరించారు. నెలాఖరులోగా గోదావరిలో ప్రవాహం తగ్గుతుందని, నవంబర్‌లో పనులు ప్రారంభించి వేసవిలోగా పూర్తి చేస్తామని అన్నారు. నిపుణుల కమిటీతో సమావేశమైనవారిలో నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) నాగేంద్ర రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులున్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)