Breaking News

ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు చారిత్రాత్మక నిర్ణయం

Published on Fri, 07/17/2026 - 22:05

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య కార్డుల అమలుకు శ్రీకారం చుట్టడం పట్ల ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.  ఉద్యోగులు, పెన్షనర్లకు నాణ్యమైన, నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక చొరవ తీసుకుని ఆరోగ్య కార్డుల అమలును వేగవంతం చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ చైర్మన్  లచ్చిరెడ్డి, ఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు, ఈహెచ్‌సీటీ ట్రస్ట్ మెంబర్ దేవరకొండ సైదులు, ఎస్‌టీఎఫ్‌  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  యూ. పోచయ్య, ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు & ఈహెచ్‌సీటీ ట్రస్ట్ మెంబర్ సదానందం గౌడ్, పెన్షనర్ల అసోసియేషన్ చైర్‌పర్సన్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.  

ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆదర్శప్రాయమని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు ఉద్యోగులు, పెన్షనర్ల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)