Breaking News

తెలంగాణ ప్రాజెక్టు–1లో విద్యుత్‌ ఉత్పత్తి షురూ

Published on Mon, 07/24/2023 - 02:20

జ్యోతినగర్‌: రాష్ట్రానికి విద్యుత్‌ వెలుగులు అందించేందుకు మొదలుపెట్టిన తెలంగాణ స్టేజీ–1లోని 800 మెగావాట్ల మొదటి యూనిట్‌ ఆదివారం రాత్రి 7.40 గంటలకు ఉత్పత్తి ప్రారంభించింది. 801.2 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి దశలోకి వచ్చినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. 800 మెగావాట్ల యూనిట్‌ కంట్రోల్‌ రూంలో సీజీఎం కేదార్‌ రంజన్‌పాండుతో పాటు ఉన్నతాధికారులు, అధికారులు స్వీట్లు పంచుకుని అభినందనలు తెలుపుకొన్నారు.  
 
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఎన్టీపీసీ  ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఎన్టీపీసీ యాజమాన్యం ప్రతి­ష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు స్టేజ్‌–­1లో 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణం చేపట్టారు. మొదటి యూనిట్‌ (800 మెగావాట్ల) నిర్మాణ పనులు వేగంగా కొనసాగా­యి. స్టేజీ–1లో నిర్మితమైన 800 మెగావాట్ల మొదటి యూనిట్‌లో పూర్తిస్థాయి విద్యుత్‌ ఉత్పత్తి దశలోకి వచి్చన క్రమంలో ఈనెల 28లోపు కమర్షియల్‌ డిక్లరేషన్‌ చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నట్లు సమాచారం. 

ఆగస్టు నుంచి రెండో యూనిట్‌లో..? 
ఎన్టీపీసీ తెలంగాణ స్టేజీ–1లో నిర్మితమైన 800 మెగావాట్ల రెండో యూనిట్‌ స్టీమ్‌ బ్లోయింగ్‌ మే 20న పూర్తి చేసుకుంది. టర్భైన్‌ జనరేటర్‌తోపాటు వివిధ పనులు పూర్తి చేశారు. రెండో యూనిట్‌ సైతం ఆగస్టులో విద్యుత్‌ ఉత్పత్తి దశలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు యూనిట్లలో విడుదలయ్యే మొత్తం 1600 మెగావాట్ల విద్యుత్‌ తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో అందించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.  

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?