Breaking News

కరెంటు చార్జీలు పెరగవు!

Published on Wed, 01/29/2025 - 05:00

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2025–26లో సైతం విద్యుత్‌ చార్జీలు పెరగవు. ప్రస్తుత చార్జీలనే యథాతథంగా కొనసాగించాలని కోరుతూ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌/టీజీఎన్పీడీసీఎల్‌)లు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని కోరాయి. ఈ మేరకు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌), టారిఫ్‌ ప్రతిపాదనలు 2025–26ను మంగళవారం ఈఆర్సీకి సమర్పించాయి. 

డిస్కంల అంచనాల ప్రకారం 2025–26లో రాష్ట్రానికి విద్యుత్‌ సరఫరా చేసేందుకు అన్ని రకాల ఖర్చులు కలిపి మొత్తం రూ.65,849 కోట్ల వ్యయం కానుంది. అందులో విద్యుత్‌ కొనుగోళ్లకే రూ.50,572 కోట్ల వ్యయం కానుండగా, నిర్వహణ, పర్యవేక్షణ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు కలిపి మిగిలిన వ్యయం కానుంది. అయితే, ప్రస్తుత చార్జీలతో రూ.45,698 కోట్ల ఆదాయం మాత్రమే రానుంది. దీంతో విద్యుత్‌ చార్జీలు పెంచకపోతే రూ.20,151 కోట్ల నష్టాలను మూటగట్టుకోనున్నాయి. 

అయితే, డిస్కంలు సమర్పించిన అంచనా ప్రతిపాదనలపై ఈఆర్సీ రాతపూర్వకంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన తర్వాత హైదరాబాద్, వరంగల్‌లో బహిరంగ విచారణ సైతం జరపనుంది. అనంతరం వాస్తవికతకు దగ్గరగా ఉండేలా డిస్కంల అంచనాలను సవరిస్తూ ఆమోదించనుంది. 

ఒకవేళడిస్కంల ఆదాయ లోటు రూ.20,151 కోట్లు వాస్తవమేనని ఈఆర్సీ ఆమోదిస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీలను పెంచాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వంపై సబ్సిడీల భారం పడకుండా గతంలో ఈఆర్సీ.. డిస్కంల ఆదాయ లోటును తగ్గించి చూపించినట్టు విమర్శలున్నాయి.  

ఏటేటా నష్టాలు 
ప్రభుత్వం ఏ మేరకు సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరిస్తే ఆ మేరకు మాత్రమే ఆదాయ లోటు ఉందని ఈఆర్సీ నిర్ధారించడంతో డిస్కంల నష్టాలు ఏటేటా పెరుగుతున్నాయి. 2023–24లో రూ.6,299.29 కోట్ల కొత్త నష్టాలను మూటగట్టుకోగా, మొత్తం నష్టాలు రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. 

ఒక్క టీజీఎస్పీడీసీఎల్‌ నష్టాలే రూ.39,692 కోట్లకు చేరగా, టీజీఎన్పీడీసీఎల్‌ రూ.17,756 కోట్ల నష్టాల్లో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం డిస్కంలకు రూ.11,499 కోట్ల సబ్సిడీలను చెల్లించేందుకు అంగీకరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ చార్జీల పెంపు భారం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి సబ్సిడీలను మరింతగా పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

ఇదిలా ఉండగా, విద్యుత్‌ టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించినా, హెచ్‌టీ కేటగిరీ వినియోగదారులకు గ్రిడ్‌ సపోర్ట్‌ చార్జీలతోపాటు స్టాండ్‌ బై చార్జీలు, క్రాస్‌ సబ్సిడీ సర్‌చార్జీలను మాత్రం సవరించాలని డిస్కంలు ఈఆర్సీని కోరినట్టు తెలిసింది.  

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)