Breaking News

ఎత్తిపోతలకు ‘కరెంట్‌’ తిప్పలు

Published on Thu, 12/25/2025 - 04:42

సాక్షి, హైదరాబాద్‌: ఎత్తిపోతల పథకాల నిర్వహణ భారంగా మారింది. వాటి విద్యుత్‌ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో బకాయిలు ఏటేటా పెరిగి కొండలాగా మారాయి. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు విద్యుత్‌ సరఫరా చేస్తున్న దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన విద్యుత్‌ బిల్లుల బకాయిలు ఏకంగా రూ.24,312 కోట్లకు ఎగబా కాయి. 2014–25 మధ్య కాలంలో మొత్తం రూ.36,435 కోట్ల విద్యుత్‌ బిల్లులు రాగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.12,278 కోట్లు మాత్రమే చెల్లించింది. 

» ఎత్తిపోతల పథకాల పంప్‌హౌస్‌లకు విద్యుత్‌ సరఫరా చేసే సబ్‌స్టేషన్ల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను చూస్తున్న తెలంగాణ విద్యుత్‌ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)కు చెల్లించా ల్సిన బకాయిలు మరో రూ.1,550.22 కోట్లకు పెరిగాయి. 
»  నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాల సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు రూ.4,849.57 కోట్లకు చేరాయి. మొత్తం కలిపి రూ.30,711.79 కోట్ల బిల్లుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలు, ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు బిల్లుల చెల్లింపులకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది.

కరెంట్‌ బకాయిలు ఇలా.....
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని వివిధ పంప్‌హౌస్‌ల నిర్వహణకు సంబంధించిన మొత్తం 17 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, 2019–20 నుంచి 2025 సెప్టెంబర్‌ వరకు 9,384 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ)ల విద్యుత్‌ వినియోగం జరిగింది. ఇందుకుగాను మొత్తం రూ.13,156 కోట్ల విద్యుత్‌ బిల్లులు రాగా, ప్రభుత్వం రూ.3,971 కోట్లు మాత్రమే చెల్లించడంతో రూ.9,185 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. 

» దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన 13 విద్యుత్‌ కనెక్షన్లుండగా, 2014–15 నుంచి 2025 సెప్టెంబర్‌ వరకు 5,257 ఎంయూల విద్యుత్‌ వినియోగం జరిగింది. మొత్తం రూ.5,568 కోట్ల విద్యుత్‌ బిల్లులు వస్తే ప్రభుత్వం రూ.1,727 కోట్లను మాత్రమే చెల్లించింది. 

»ఇతర ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మొత్తం 462 కనెక్షన్లుండగా, 2014–15 నుంచి 2025 సెప్టెంబర్‌ వరకు 15,971 ఎంయూల విద్యుత్‌ వినియోగం జరిగింది. మొత్తం రూ.17,710 కోట్ల బిల్లులు రాగా ప్రభుత్వం రూ.6,580 కోట్లు చెల్లించింది. 

రెండేళ్లుగా సబ్‌స్టేషన్లలో....
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన సబ్‌స్టేషన్ల పనులను రెండేళ్లుగా కాంట్రాక్టర్లు నిలుపుదల చేశారని ట్రాన్స్‌కో ప్రభుత్వానికి నివేదించింది. ఎత్తిపోతల పథకాల సబ్‌ స్టేషన్ల నిర్మాణ బాధ్యతలను గత ప్రభుత్వం ట్రాన్స్‌కోకు అప్పగించింది. 

మొత్తం రూ.10,037.12 కోట్ల వ్యయంతో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను ట్రాన్స్‌కో పర్యవేక్షిస్తుండగా, ప్రభుత్వం రూ.4,749.57 కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు బకాయిపడింది. నిర్మాణం పూర్తయిన ఎత్తిపోతల పథకాల సబ్‌స్టేషన్ల నిర్వహణ, పర్యవేక్షణను చూస్తున్నందుకుగాను ట్రాన్స్‌కో రూ.1550.22 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)