Breaking News

ఈవీలు.. రయ్‌ రయ్‌

Published on Sun, 11/02/2025 - 04:18

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ ఆర్టీసీలో ఈవీలు (ఎలక్ట్రికల్‌ వాహనాలు) పరుగులు తీస్తున్నాయి. కాలుష్య రహిత, పర్యావరణహితమైన ప్రయాణ సదుపాయం కోసం నగరంలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్‌ బస్సులను  ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో 265 ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్నాయి. 

ఈ నెలలో  కొత్తగా మరో 50 బస్సులు  అందుబాటులోకి రానున్నాయి. ఆర్డినరీతో పాటు, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్‌ విభాగాల్లోనూ ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో  225 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆర్టీసీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో ఈవీల సంఖ్య 540కి చేరనుంది. 

మెరుగైన.. నాణ్యమైన సేవల కోసం.. 
ప్రస్తుతం నగరంలోని 25 డిపోల్లో నిత్యం 2,850 బస్సులు  ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ప్రతిరోజూ 24 లక్షల  మంది సిటీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో 16 లక్షల మందికి పైగా మహిళా ప్రయాణికులు. రెండేళ్ల క్రితం మహిళలకు ఉచిత  ప్రయాణ సదుపాయం కల్పించినప్పటి నుంచి సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. 

గతంలో కేవలం  65 శాతం వరకు  ఆక్యుపెన్సీ ఉండగా, మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం 100 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన సదుపాయాన్ని అందజేసేందుకు దశలవారీగా ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. 

పీఎం– ఈ డ్రైవ్‌ షురూ... 
దేశంలోని మెట్రో నగరాల్లో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం  ప్రధానమంత్రి ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ (పీఎం–ఈ డ్రైవ్‌)కు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద హైదరాబాద్‌ ఆర్టీసీకి మరో 2000  బస్సులు రానున్నాయి. వీటి కోసం ఈ నెలలో టెండర్‌లను ఖరారు చేయనున్నారు. 

వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ 2000 బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న డీజిల్‌ బస్సులను జిల్లాలకు తరలిస్తారు. దీంతో 2027 నాటికి నగరంలో  పూర్తిగా కాలుష్యరహిత, పర్యావరణ ఎలక్ట్రిక్‌ బస్సులు మాత్రమే తిరగనున్నాయి.  

హెచ్‌ఎండీఏకు భారంగా డబుల్‌ డెక్కర్‌ బస్సులు..  
హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో నడుస్తున్న 6 డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రిక్‌ ఆర్థికంగా పెనుభారంగా మారాయి. నిజాం కాలం నాటి  డబుల్‌ డెక్కర్‌ బస్సులకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు అప్పటి  ప్రభుత్వం 2023లో ఈ  బస్సులను కొనుగోలు చేసింది. హెచ్‌ఎండీఏ ఒక్కో బస్సును రూ.2.16 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది. కానీ.. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, లుంబిని పార్కు, సెక్రటేరియట్‌ రూట్‌లో మాత్రమే ఇవి సందర్శకులకు అలంకార ప్రాయంగా కనిపించడం గమనార్హం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)