Breaking News

Telangana: కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఫస్ట్‌ రిజల్ట్‌ అక్కడే..

Published on Mon, 06/03/2024 - 09:51

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పగడ్బంధీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

కాగా, తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 49 మంది అబ్జర్వర్లు ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా కౌంటింగ్‌కు 10వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే, మరో 50 శాతం మంది అడిషనల్‌గా అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని.. ప్రతీ టేబుల్ వద్ద అధికారులు పరిశీలిస్తారని ఈసీ తెలిపింది.

కౌంటింగ్‌లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం  ఉంది. కౌంటింగ్‌లో అత్యధికంగా చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండలో 24 రౌండ్లు ఉండగా.. అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక, చేవెళ్ల, మల్కాజ్‪గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ- కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2లక్షల 80వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ పేర్కొంది.

అలాగే, కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్‌ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలను స్టోరేజ్ రూమ్‪లలో పెడతామని.. భారీ బందోబస్తు ఉంటుందని ఈసీ వెల్లడించింది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు