Breaking News

అన్నం పెట్టమంటే కోడలు చెప్పుతో కొడుతోంది

Published on Tue, 06/10/2025 - 11:16

హనుమకొండ అర్బన్‌: ‘కుమారుడితో సహజీ వనం చేస్తున్న మహిళ మాకు అన్నం పెట్టమంటే చెప్పుతో కొడుతోంది’ అని ఓ వృద్ధ దంపతులు సోమ వారం హనుమకొండ కలెక్టరే ట్‌లో జరి గిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు మొరపెట్టు కున్నారు. ఈ మేరకు వారిని ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు వెల్లడించారు. ‘నా పేరు ఊడత కొమురమ్మ, భర్త పేరు సమ్మ య్య. మాది పరకాల మండలం సీతారాంపూర్‌ గ్రామం. మాకు ఇద్దరు కొడుకులు. 

వారసత్వంగా వచ్చిన భూమిని 1.30 ఎకరాల చొప్పున ఇద్దరికీ సమానంగా పంచాము. కుల పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నప్పుడు మమ్మల్ని జీవితాంతం సాదాలని చెప్పారు. కానీ, పిల్లలు ఆస్తి తీసుకున్నాక మా ఆలనాపాలనా చూడటం లేదు. ఒక కొడుకుకు ఇబ్బందుల కారణంగా మూడు పెళ్లిళ్లు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మా కోడలు అన్నం పెట్టమంటే చెప్పుతో కొడుతోంది. మాకు తిండి పెట్టని కొడుకులకు మా ఆస్తి ఎందుకివ్వాలి. అందుకే అధికారులకు విన్నవిస్తున్నాం.. మా ఆస్తిని మా పేర్ల పైకి మార్చండి.  మా ఆలనాపాలనా చూసుకున్న వారికి మా తదనంతరం ఆస్తి చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)