Breaking News

సురేశ్‌ రైనాపై ఈడీ ప్రశ్నల వర్షం

Published on Thu, 08/14/2025 - 10:13

న్యూఢిల్లీ: చట్టవ్యతిరేక బెట్టింగ్‌ యాప్‌ల కోసం ప్రచారంచేసిన ఉదంతంలో మాజీ భారతీయ క్రికెటర్‌ సురేశ్‌ రైనాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బుధవారం ఎనిమిది గంటలపాటు విచారించి ప్రశ్నల వర్షం కురిపించింది. సెంట్రల్‌ ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు ఉదయం 11 గంటలకు వచ్చిన రైనా రాత్రి 8 గంటలకు వెళ్లిపోయారు. మనీలాండరింగ్‌ నిరోధక (పీఎంఎల్‌ఏ) చట్టం కింద అధికారులు రైనా వాంగ్మూలాన్ని నమోదుచేసుకున్నారు. 

క్రీడాసంబంధ బెట్టింగ్‌ యాప్‌ అయిన 1 గీట్ట కోసం రైనా ప్రమోట్‌చేశారని ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. యాప్‌ తరఫున ఎవరు మిమ్మల్ని కలిశారు? ఎవరు మీకు ప్రమోషన్‌ ఫీజు చెల్లించారు? నగదు, డిజిటల్‌ రూపంలో ఎంత చెల్లించారు? ఏఏ రాష్ట్రాల్లో ఏ తరహా ప్రమోషన్‌ చేశారు? ఇది చట్టవ్యతిరేక యాప్‌ అని మీకు ముందే తెలుసా? అంటూ పలు రకాల ప్రశ్నలు సంధించి సమాధానాలను రాబట్టింది. బెట్టింగ్‌ యాప్‌ల మోసాలకు సంబంధించిన ఈ కేసులో ఇప్పటికే ఈడీ గూగుల్, మెటా ప్రతినిధులను పిలిచి ప్రశ్నించింది. 

 భారత్‌లో ఆన్‌లైన్‌బెట్టింగ్‌ యాప్‌ల మార్కెట్‌ విలువ ఏకంగా100 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటడం గమనార్హం. ఇది ఏటా 30 శాతం వృద్ధితో మరింతగా విస్తరిస్తోంది. భారత్‌లో 22 కోట్ల మంది ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లను వినియోగిస్తున్నారు. వారిలో సగం మంది సాధారణ యూజర్లుగా కొనసాగుతున్నారు. వందలాది ఆన్‌లైన్‌ బెట్టింగ్, గ్యాబ్లింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను మూసేయాలంటూ 2022 ఏడాది నుంచి 2025 జూన్‌దాకా 1,524 సార్లు ఉత్తర్వులు జారీచేశామని కేంద్రం ఇటీవల లోక్‌సభకు తెలిపింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)