Breaking News

ఐఏఎస్‌ అమోయ్‌ కుమార్‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఈడీ ఫుల్‌ ఫోకస్‌

Published on Thu, 10/24/2024 - 09:03

సాక్షి, హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారి అమోయ్‌ కుమార్‌ నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. నిన్న ఎనిమిది గంటల పాటు విచారించిన ఈడీ.. నేడు కూడా మరోసారి విచారణకు రావాలని తెలిపింది. మహేశ్వరం మండలం నాగరంలో 42 ఎకరాల భూమి కేటాయింపుపై అమోయ్‌ కుమార్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది.

గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్ 50 ఎకరాల భూదాన్ భూములను అన్యాక్రాంతం చేశాడు. విజిలెన్స్ విచారణలో అమోయ్ కుమార్ బాగోతం బయటపడింది. విజిలెన్స్ అధికారులు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగారంలోని సర్వే నెంబర్ 181, 182 లోని 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. అందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందినదని బోర్డ్ వాదిస్తోంది.

ఇక, ఈ భూమి జబ్బార్దస్త్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. తర్వాత ఆయన కొడుకు హజీఖాన్ 50 ఎకరాల ల్యాండ్‌ను భూదాన్ బోర్డుకి దానం చేశాడు. 2021లో హజీఖాన్ వారుసురాలిని అంటూ 40 ఎకరాలు తనదేనని ఖాదురున్నీసా దరఖాస్తు చేసుకుంది. క్షేత్ర స్థాయిలో ఆర్డీవో, తహశీల్దార్, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్ ఖాదురున్నీసాకు అనుకూలంగా ఉండి.. ఆఘమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మారు. దీంతో ఎన్నికల సమయంలో భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ భూమిపై క్రయవిక్రయాలు చేయకుండా ధరణిలో నిషేధిత జాబితాలో పెట్టారు అధికారులు. దీంతో, ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. మరోవైపు ఈ కేసులో ఈడీ.. ఎమ్మార్వో జ్యోతి, ఆర్డీవోను సైతం నేడు విచారించే అవకాశం ఉంది.

విచారణకు రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)